భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య ‘కవచం’

Posted on : 12/11/2018 08:57:00 pm


బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘క‌వ‌చం’. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన శ్రీనివాస్ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ లుక్‌లో శ్రీనివాస్ చాలా బాగున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పుడు టీజర్ చూస్తుంటే సినిమాలో శ్రీనివాస్ పోలీస్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. 

‘కవచం’ టీజర్‌ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. టీజర్‌‌ను యాక్షన్ ప్రోమోలతో నింపేశారు. డైలాగులు కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ‘భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా. వాడే పోలీస్’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్. ‘అనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు లేడు. రాణి మాత్రమే. ఆ రాణికి కవచంలా ఒక సైనికుడు’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమా కూడా హీరోయిన్‌కి అండగా నిలిచే హీరో కథతోనే తెరకెక్కినట్లు అర్థమవుతోంది. అయితే ఆ రాణి కాజల్ అగర్వాలా లేక మెహ్రీనా అనేది సినిమా చూస్తే కానీ తెలీదు. ‘పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా ఉండాలి’ అనే డైలాగుతో టీజర్ ముగిసింది. మొత్తంగా చూసుకుంటే ఈ టీజర్ యాక్షన్ ప్యాక్.