పవర్‌ఫుల్, క్రేజీ టైటిల్‌తో రాజమౌళి

Posted on : 13/11/2018 08:26:00 am


బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సెట్స్‌పైకి వచ్చాడు రాజమౌళి. సంచలన విజయం తర్వాత మరోసారి మల్టీస్టారర్‌కే ఓటు వేశాడు జక్కన. బాహుబలి కోసం ప్రభాస్, రానా దగ్గుబాటిని కలిపిన అగ్రదర్శకుడు తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చారు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాకరీ వేదికగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు రోజుకొకటి మీడియాలో వైరల్ అవుతున్నాయి.

RRR అంటే రామరావణ రాజ్యం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. ఆంగ్ల అక్షరాల వెనుక అసలైన టైటిల్ ఉందని చెప్పుకొంటున్నారు. రామ రావణ రాజ్యం టైటిల్‌కు తగినట్టే ఈ చిత్రంలో హై ఎండ్ యాక్షన్ సీన్లు ఉంటాయట. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలను తొలి షెడ్యూల్‌లో 45 రోజుల పాటు చిత్రీకరించేందుకు షూటింగ్‌ను  ప్లాన్  చేశారు. ఈ షెడ్యూల్‌లో రాంచరణ్, ఎన్టీఆర్ పాల్గొంటారని తెలిసింది.

RRR చిత్రంలో గ్లామర్ డోసేజ్ ఎక్కువగానే ఉంటుందంట. ఈ చిత్రంలో కనీసం ముగ్గురు హీరోయిన్లు గ్యారెంటీ అని చెబుతున్నారు. అందులో ఓ విదేశీ భామను ముగ్గులోకి దించినట్టు తెలుస్తున్నది. ఓ వైపు RRR షూటింగ్‌ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చేపట్టే విధంగా ప్రొడక్షన్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. నటీనటుల ఎంపిక శరవేగంగా సాగుతున్నది. అంత సవ్యంగా సాగితే 2020 వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.