నేడు అమ‌రావ‌తి మార‌థాన్-2018

Posted on : 07/01/2018 12:29:00 am

అమ‌రావ‌తి మార‌థాన్ ర‌న్ కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. విజ‌య‌వాడ, గుంటూరు ప్రాంతాల‌లో పాటు దేశ, విదేశాల‌కు చెందిన సుమారు 8 మంది ఇందులో పాల్గొనున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు ట్రాఫిక్ మ‌ళ్లించారు. అవారా ఆర్గ‌నైనేజ‌ష‌న్ కు చెందిన అనాధ పిల్ల‌లు, సీనియ‌ర్ సిటిజ‌న్స్, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సినీతార‌లు, కెన్యా, సౌత్ ఆఫ్రికా త‌దిత‌ర దేశాల‌ను చెందిన ర‌న్న‌ర్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నారు. ఆదివారం ఉద‌యం 6 గంట‌ల‌కు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ర‌న్ ప్రారంభించ‌నున్నారు. 21. 1కె, 10కె, 5కె విభాగాల్లో ర‌న్ జ‌ర‌గ‌నుంది. క్రీడాకారులు, యువ‌త‌తో పాటు సీనియ‌ర్ సిటిజ‌న్స్ ఇందులో పాల్గొనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 8 వేల ద‌ర‌ఖాస్తులు అందాయి. ఇందులో 5కె ఫ‌న్ ర‌న్ లో పాల్గొనేందుకు 5 వేల మంది త‌మ షేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. 21. 1కె. 10కె  విభాగాల్లో గెలుపొందిన విజేత‌ల‌ను బ‌హుమ‌తుల్ని అందిస్తారు. 5 కి.మి ఫ‌న్ ర‌న్ కు నిర్ధ‌ష్ట కాల‌ప‌రిమితి ఏం లేదు. ఇందులో విజేత‌ల ఎంపిక జ‌ర‌గ‌దు. పోలీస్ న‌గ‌ర‌పాల‌క సంస్థ, ప‌ర్యాట‌క శాఖ‌ల‌తో పాటు ఏపీ స్పోర్ట్ అధారిటీ, డీప్ ట్ర‌స్ట్ లు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేశాయి.