కత్తి మహేష్ 6 ప్రశ్నలు

Posted on : 07/01/2018 04:07:00 pm

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ ల  మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది అనే చెప్పాలి. ఈ సారి కత్తి వేసిన బాణం ఏనుగు కుంభస్థలానికే తగిలింది. పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తు, కత్తి మహేష్ మీద నటి పూనమ్ కౌర్ ట్వీట్స్ వేసిన విషయం తెలిసిందే, కత్తి మహేష్ ని fatso అని సంబోధిస్తూ వ్యంగ్యంగా చేసిన ట్వీట్స్ పవన్ అభిమానులను మెప్పించడంతో పాటు, కత్తిని కూడా నొప్పించింది. దీనికి ప్రతిగా కత్తి ట్వీట్స్ వేయడం తో పాటు, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడతా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఓపెన్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసింది.
            ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ కౌన్సెల్కి పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు , ఉద్రిక్త పరిస్థుతుల మధ్య భారీగా పోలీసులు మోహరించారు. చెప్పినట్టుగానే కత్తి మహేష్ ఈరోజుప్రెస్మీట్ పెట్టి  పూనమ్ కౌర్కు 6 ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టుగ వున్నాయి. కత్తి మహేష్ సంధించిన 6 ప్రశ్నలు ఇలా వున్నాయి.

1. మీకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి రావడానికి కారణం ఎవరు ?
2. తిరుమలలో పవన్ పక్కనే నిల్చొని ఒకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు?
3. పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే,మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు?
4. పవన్ కల్యాణ్ గారు మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా? లేదా?
5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం?
6. క్షుద్రమాంత్రికుడు నర్సిగం చేసిన పూజల్లో త్రివిక్రమ్‌, పవన్‌, మీరు ఎందుకు పాల్గొన్నారు? అక్కడ మీరు ఏం చేశారు?

            వీటికి సాక్ష్యాలు తన దగ్గర వున్నాయి అని, పూనమ్ కౌర్ ప్రెస్ మీట్ కి వచ్చి ఉంటే అవి చూపించే వాడిని అని కత్తి అన్నారు. తన మీద పరువు నష్టం దావా వేసిన పర్వాలేదు అని తన దగ్గర అన్ని సాక్షాలు వున్నాయి అని అన్నారు. ఈ ప్రశ్నల వల్ల తనకి లాభం చేకూరుతుంది అని నమ్ముతున్నాని కత్తి మహేష్ అన్నారు.