INTER CAST MARRIAGES..IF SUBJECTS WERE PEOPLE REVIEW

Posted on : 07/01/2018 06:06:00 pm

రివ్యూ: INTER CAST MARRIAGE..IF SUBJECTS WERE PEOPLE.
రేటింగ్‌: 3.75/5
బ్యానర్‌: CHAI BISCUIT
తారాగణం: మసాలా
సందీప్, సుహాస్, హర్షిత, దివ్య, రఘు తదితరులు
మాటలు: మసాలా సందీప్
కూర్పు: కొడాటి పవన్ కళ్యాణ్
సంగీతం: నరేన్ సిద్ధార్ధ
ఛాయాగ్రహణం: విక్రమ్ ఎడిక్స్
నిర్మాత: అనురాగ్, శరత్
రచయిత: బి మనోజ్ కుమార్
దర్శకత్వం: మసాలా సందీప్
విడుదల తేదీ: జనవరి 5, 2018
ఈ మధ్య భిన్నమైన కథలతో అందరినీ ఆకట్టుకుంటూ లఘు చిత్రాలు చేస్తున్న పాపులర్ ఛానల్ CHAI BISCUIT.
ఈ ఛానెల్ నుంచి వచ్చిన సరి కొత్త లఘు చిత్రం INTER CAST MARRIAGE..IF SUBJECTS WERE PEOPLE. పేరు కి తగట్టే ఇందులోని ప్రతీ క్యారెక్టర్ కి సబ్జక్ట్స్ పేర్లు పెట్టి అంతర్లీనంగా ప్రేమ కి కాస్ట్ తో సంబంధం లేదు అని ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు దర్శకుడు మసాలా సందీప్ ..సున్నితమైన ఆంశాన్ని ఎక్కడ వివాదం అంచున పడకుండా కడు జాగ్రత్తగా వివరించిన తీరు మెచ్చుకోదగిన విషయం. మన అందరం ఏ కులం అయినా, మనలో ఎత్తు పొడవు తరతమ్యాలే తప్ప మరేమి లేదు, అందరం మనుషులమే అనే గొప్ప అర్ధం వచ్చేలా రాసుకున్న మాటలు రచయిత ప్రతిభ కు నిదర్శనం అనే చెప్పాలి.
సందేశం ఉంది కదా అని ఇందులో కామెడీ లేదు అనుకుంటే మీరు పప్పు లో కాలేసినట్టే ..ఇందులో వచ్చే ప్రతీ మాట ఆ పాత్ర పలికే సంభాషణలు ఆయా పాత్రల పరంగా వచ్చే హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది, ఎక్కడ కూడాను సన్నివేశాలు గాని మాటాలు గాని అతికించినట్టుగా కాకుండా కథలో లీనమై ఉంటాయి. నేపధ్య సంగీతం పరంగా కొంచెం నిరాశ పరిచినా దర్శకుడి తో అనుసంధానం కలిగి ఉన్న రచయిత మనకు సంగీతం గురించి ఆలోచించనీయదు. మొత్తంగా చూస్తే కులాంతర వివాహాలు తప్పు కాదు అని ఆమోదయోగ్యమైన రీతి లో, ఒక సరికొత్త కోణం లో చెప్పిన తీరు చాలా బాగుంది, ఈ మధ్య వచ్చిన లఘు చిత్రాలలో లో ఉత్తమమైనది గా చెప్పొచ్చు.
REVIEWED BY - విప్లవ్ కుమార్ రెడ్డి సత్తార్