అప్పుడు సుచిలీక్స్ ఇప్పుడు కత్తి లీక్స్

Posted on : 08/01/2018 01:13:00 am

                        ఇంటర్నెట్ వినియోగం పెరిగినపుడు నుంచి సోషల్ మీడియాలో ఒక అంశం మీద ట్రెండ్స్ చేయడం ఈ మధ్య బాగా ఎక్కువ అయింది . ఈ ట్రెండ్స్ వల్ల ఒక విషయం గురించి చాల కొత్త విషయాలు మరియు చాల కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి అనేది వాస్తవం. ఒక విషయాన్నీ సోషల్ మీడియాలో ఎక్కువ మందికి చేరడానికి ఈ ట్రెండ్స్ కీలకంగా మారాయి. దీనికోసం అనే చాల మంది సినీ నటులు, రాజకీయ నాయకులూ సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. మనకి నచ్చని వాళ్ళ మీద బురద చల్లాలి అన్న, మనకి నచ్చిన వాళ్ళని ఆకాశానికి ఎత్తాలి అన్న ఈ ట్రెండ్స్ చాల చక్కగా ఉపయోగపడుతున్నాయి.
                          అసలు విషయానికి వస్తే గత ఏడాది మార్చ్ లో సుచిలీక్స్ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో , ఇటు సోషల్ మీడియాలో రెండిటిలో బాగా పాపులర్ అయింది, ఎంత పాపులర్ అంటే ట్విట్టర్లో ఈ అంశం మీద చాల రోజులు ట్రెండ్స్ నడిచాయి. ఇప్పుడు కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలు కొత్త ట్రెండ్ కి దారి తీశాయి, అదే కత్తి లీక్స్ (#kathileaks). ఈ కత్తి లీక్స్ సూచిలీక్స్ ని గుర్తుచేసేలా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా తో పాటు సోషల్ మీడియా లోను బాగా ట్రెండ్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా చూస్కుంటే ఒక్క టీవీ9 దీని మీద 5 గంటలు చర్చ పెట్టింది, ఆ తర్వాత ఆ చర్చను మళ్ళి రోజంతా రిప్లయ్ చేసింది, ఈ ఒక్క ఛానల్ మాత్రమే కాదు, దాదాపు అన్ని చానెల్స్ దీని మీద చర్చను ప్రారంభించాయి. ఇటు సోషల్ మీడియా లోను #కత్తిలీక్స్ బాగా ట్రెండ్ అవుతుంది, చాల మంది నెటిజన్స్ దీని గురించే చర్చిస్తున్నారు. కత్తి చెప్పింది నిజం అని నమ్మేవారు ట్విట్టర్ లో వారి వద్ద వున్నా సాక్ష్యాలను ఇమేజెస్ / వీడియోస్ ద్వారా పోస్ట్ చేసి ఏ ట్రెండ్ లో పాల్గొంటున్నారు. తమ అభిమాన హీరో ఇమేజ్ని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ ట్రెండ్ లో పాల్గొటున్నారు. ఈ ట్రెండ్ ని అనలైజ్ చేసి చుస్తే ఇపుడు సోషల్ మీడియా లో కత్తి కి బాగా ఫాలోయింగ్ పెరిగింది అనే చెప్పాలి. చాల మంది నెటిజన్స్ కత్తి మహేష్ చెప్పింది నమ్ముతున్నారు, దానికి సంబంధించి వారి వద్ద వున్న ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు