చంద్రబాబు కు షాక్ ఇచ్చిన కలెక్టర్లు

Posted on : 08/01/2018 01:47:00 am

కలెక్టర్లు అభివృద్ధి పనులకి సహకరించటం లేదని, మరుగుదొడ్లు నిర్మాణానికి సంబందించిన బిల్స్ ముందుకు వెళ్ళటం లేదని, అవసరమైతే వాళ్లకి వ్యతిరేకంగా దీక్ష చేస్తానని బెదిరించిన చంద్రబాబుకి కలెక్టర్ల సంఘం కూడా అంతే ఘాటుగా స్పదించింది.
          ఈ సందర్భంగ వారు విడుదల చేసిన బహిరంగ లేఖ సంచలనంగా మారింది, పనులు ఏమి చేయకుండానే బిల్స్ కోసం కలెక్టర్లను ఒత్తిడి చేస్తున్నారని దానిని అదుపులో పెట్టాలని, అలాగే జన్మ భూమి కమిటీలు నిజాయితీగా కమిషన్లు లేకుండా పని చేయాలనీ, అప్పుడు తమ వద్దకు వస్తే పనులు తాముకూడా వెంటనే నిజాయితీగా చేస్తాం అని దెప్పి పొడిచారు.
    అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 992 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 836 కోట్లు , మొత్తం 1830 కోట్లకి కేవలం 1200 కోట్లకి పనులు చేసినట్లు చూపెట్టి మిగతా 600 కోట్లు మీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేసారని ఎలాంటి పరిస్థితుల్లో కలెక్టర్లను నిందించడం సబబు కాదని అన్నారు. తమలో ఏమైనా లోపాలు ఉంటే తమను బదిలీ చేయాలి కానీ అనవసరం గ తమను నిందించడం తగదని వారు రాసిన లేఖలో అన్నారు.
       ఇపుడు ప్రభుత్వానికి అనుకూలంగ పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రభుత్వాన్ని, వారు చేసిన 600 కోట్ల అవినీతిని ఎండకట్టడం హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి, ఏది ఏమి అయినా కలెక్టర్లను బెదిరిద్దాం అని ప్రయత్నించినా ముఖ్యమంత్రికి ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి.