ఒక దెబ్బకి రెండు పిట్టలు

Posted on : 08/01/2018 02:28:00 am

             గత కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కువగా ప్రదీప్ మాచిరాజు, గజల్ శ్రీనివాస్ మరియు కత్తి మహేష్ ల గురించి ఎక్కువగా వస్తుంది, కొన్ని చానెల్స్ రోజంతా వీటితోనే కలం గడిపేస్తున్నాయి, జనాలకి కూడా వీటి మీద ఆసక్తి వికటించి విసుగు వస్తుంది. మీడియా ఎదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి జనాల దృష్టిని మళ్ళిస్తుంది అని స్పష్టంగ అర్ధం అవుతుంది. ఇదంతా ఎందుకు చేస్తుంది టీ ర్ పి (TRP) ల కోసమా ? ఇంకా ఏది అయినా కోణం వుందా ?
            దీని గురించి లోతుగా విశ్లేషిస్తే ఇది అంత ఎదో ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనే చెప్పాలి. తెలుగు మీడియా చాల వరకు ఒక పార్టీ అధీనంలో వుంది అనేది జగమెరిగిన సత్యం .పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి జనం అడుగడునా నీరాజనాలు పలుకుతున్నారు, ఇంతగా జనం వస్తారు అని వైస్సార్ కాంగ్రెస్ కూడా ఉహించి ఉండదు . వస్తున్నా జనాలు దేనికి సంకేతం అంటే ప్రభుత్వ వ్యతిరేకతకు అని ఇట్టే తెలిసిపోతుంది. దీని నుంచి జనాలను డైవర్ట్ చేయడానికే మీడియా ఇలా చేస్తుందా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇపుడు రాష్ట్ర సమస్యలు అయినా పోలవరం, స్పెషల్ స్టేటస్ మరియు వెలుగు చూస్తున్న అవినీతి వీటి గురించి మీడియా కవర్ చేయకుండా ఒక ప్రణాళికతో దీన్ని మరుగున పడేస్తుంది.  
       కత్తి మహేష్ వెనక ఎవరు వున్నారు ? పవన్ కళ్యాణ్ అభిమానులు గుడ్డిగా వైసీపీ వుంది అని నమ్ముతున్న, వైసీపీ కి సంబందించిన చానెల్స్ లో దాని గురించి పెద్దగా పట్టించుకోట్లేదు అనే చెప్పాలి, కొంచెం ఆలోచించే ఎవరికైనా ఈ కింద ప్రశ్నలు
నిజం అనే అనిపిస్తాయి.
1. ప్రభుత్వం లో జరిగిన బ్రాండ్ అంబాసిడర్ నియామకం గురించి, ఎవరు రికమెండ్ చేసారు అని కత్తి మహేష్ కి ఎలా తెలిసింది ?
2. తిరుమల లోపల జరిగిన నామగోత్ర పూజ గురించి ప్రభుత్వం లో వున్నా వారికీ తప్ప వేరే వారికీ తెలిసే అవకాశం చాల తక్కువ, కానీ కత్తికి దీనికి సంబందించిన సాక్ష్యాలు ఎలా వచ్చాయి ?
3. కత్తి ని ప్రభుత్వ అనుకూల మీడియా ( టీవీ9 (TV9), ఏ బి న్ (ABN) ,మహా (Mahaa) etc) ఈ చానెల్స్ మాత్రమే ఎందుకు ఎక్కువగా హైప్ చేస్తున్నాయి?
4. వైసీపీ కూడా ఊహించని అంతగా జగన్ పాదయాత్రకు జనాలు వస్తున్నపుడు కత్తిని పంపాల్సిన అవసరం వైసీపీ కి ఏంటి ?
5. వైసీపీకి కాపు వోట్ బ్యాంకు కావాలి, గత ఎన్నికలలో కాపు ఓటు బ్యాంకు వల్లే వైసీపీ అధికారం కోల్పోయింది అనేది అక్షర సత్యం, మరి అలాంటపుడు కాపులు ఆరాధించే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే వైసీపీ కి వచ్చే లాభం ఏంటి ?  
               ఈ ప్రశ్నలు గమనించిన వారికీ అర్ధం అయ్యే విషయం ఏంటి అంటే కత్తి వెనక ప్రభుత్వం వుంది అని అర్ధం అవుతుంది, చర్చల్లో కత్తికి వస్తున్న కాల్స్ చుస్తే చాల మంది పవన్ అభిమానులు కత్తి వెనక వైసీపీ వుంది అని బహిరంగంగానే చెప్తున్నారు, ఇది చూసినపుడు అధికార పక్షం తాను అనుకున్న విషయంలో విజయం సాధించింది అనే అనుకోవాలి. అలాగే ఇటు జగన్ కి వస్తున్నా జనాదరణని కూడా ప్రజల్లోకి వెళ్లకుండా చేయడం లో అధికార పార్టీ, దాని అనుకూల మీడియా విజయం సాధించాయి అనే చెప్పాలి. అధికార పార్టీ అటు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, మరో వైపు ఈ నిందని ప్రతిపక్ష వైసీపీ మీద వచ్చేలా చేసి అటు జగన్కి, ఇటు పవన్ కళ్యాణ్కి ఒకేసారి దెబ్బ కొట్టింది. అందుకే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు.