మరోసారి దుస్సాహసం చేసిన చైనా

Posted on : 08/01/2018 11:57:00 pm

  గత ఏడాది జూన్ లో చైనా డోక్లామ్ (Doklam) చేపట్టిన రహదారి నిర్మాణం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే, భూటాన్ వివాదాస్పద ప్రాంతంలో చైనా రహదారి నిర్మాణాన్ని అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేసింది, అయినా చైనా తగ్గకపోవడంతో భూటాన్ సహాయం కోరడంతో భారత దళాలు చైనీయులను నిరోధించటానికి వెళ్లాయి. 2 నెలల ఉద్రిక్తల తర్వాత ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో ఆగష్టు 28న వాటి సైన్యాలను ఉపసంహరించుకున్నాయి.
           తాజాగా చైనా మరోసారి భరితెగించింది, అరుణాచల్ ప్రదేశ్ లో ట్యూటింగ్ (Tuting) ప్రాంతంలో మరోసారి రహదారి నిర్మాణానికి ప్రయత్నిచింది, విషయం భారత సైన్యానికి తెలియడంతో భద్రత దళాలు వెంటనే అప్రమత్తం అయ్యాయి, సైన్యం వెంటనే ట్యూటింగ్ (Tuting) ప్రాంతానికి చేరుకొని వారివద్ద వున్న పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఇరువైపులా బోర్డర్ సెక్యూరిటీ పర్సోన్నల్ (BPM) చర్చలు జరిపి ఈ వివాదానికి ముగింపు పలికారని తెలుస్తుంది.
       డోక్లామ్ (Doklam) లో లాగ కాకుండా ఈసారి చైనా ఆర్మీ వాస్తవాధీన రేఖను (LAC) దాటారు అని ఒప్పుకొని, నిర్మాణానికి సంబందించిన కార్మికులను వెనక్కి పంపించింది. అలాగే ఈ నిర్మాణానికి సంబందించిన కార్మికులను ఇంకోసారి ఇటు రాకుండా చూసుకుంటాం అని చైనా ఆర్మీ మాట ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు భారత్ కూడా స్వాధీనం చేసుకున్న పరికరాలను తిరిగి ఇచేసినట్టు తెలుస్తుంది.
        ఏది ఏమి అయినా డోక్లామ్ (Doklam) లో కాకుండా ఇరు వైపులా సంయమనం పాటించి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా చక్కగా వ్యవహరించాయి అని చెప్పాలి