అమరావతి లో అశ్వమేధం...

Posted on : 09/01/2018 12:39:00 am

ఆంధ్రుల కొత్త రాజధాని నగరం అమరావతి వైభవం కోసం 'అశ్వమేధయాగగం' నిర్వహిస్తున్న CM గాయత్రీ మహా యాగం వద్ద ఈ ప్రసంగం చేసారు.

ఆయన ఈ యజ్ఞం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, సూర్య భగవానుని ప్రార్ధించి క్రింది అంశాలను పేర్కొన్నారు:

 - మనం అందరం పవిత్రమైన సూర్యదేవుణ్ణి ప్రార్ధించుదాం, ఎందుకంటే ఆయన మనకు చాలా సౌర శక్తిని ఇస్తున్నాడు, దాని వలన మనం చాల విధ్యుచ్చక్తిని ఉత్పత్తి చెసుకోవచ్చు.

 - మన జీవితాల్లో అత్యంత ముఖ్యమైన భాగమైన నీటి కోసం "జల సిరికి హారిథి" కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం.

 - మనం చెట్లను కాపాడినట్లయితే అవి మనల్ని రక్షిస్తాయి, ఇదే నినాదంతో వన మహోత్సవమును ప్రారంభించి, ప్రతి కార్తీక మాసంలో చెట్లను ప్రార్ధించమని ప్రజలను కోరుతున్నాం. అంతే కాకుండా భవిష్యత్తులో చెట్లు కోసం మరొక యాగం చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి గారు తెలిపారు.

 - టెక్నాలజీలో భారతదేశం ప్రపంచ నంబర్ 1, మనం గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ యొక్క CEO లను ఉత్పత్తి చేస్తున్నాము, కాబట్టి మనం టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన వారమని CM పేర్కొన్నారు.

 - మరియు ఆయన యాగం లో పాల్గొన్న ఒక ప్రసిద్ధ మెడికల్ డాక్టర్ గురించి ప్రస్తావించారు, ఆయన లాగానే విద్యావంతులైన ప్రజలు ఈ దేశానికి ఉపయోగపడుతున్నారని ప్రశంసించారు,ఆధ్యాత్మికతలో వైద్యులు ఆసక్తిని మరియు మతపరమైన విలువలను ప్రోత్సహించడంలో ఆయన ప్రయత్నాలకు వందనం చేశారు.

ఒక సామాన్యుని అభిప్రాయం:

1. CM గారు రాష్ట్ర పౌరులకు ఏం బోధించడానికి ప్రయత్నిస్తున్నారు?

2. ఆయన మనల్ని ఎటు వెళ్ళమని మార్గనిర్దేశం చేస్తున్నారు?

3. ఒక ఇద్దరు CEOల పేర్లు చూసుకుని మనని మనం ప్రపంచ సాంకేతికతకు మనమే దిశా నిర్దేశం చేస్తున్నాం అనుకోవాలా? మనం అసలు టెక్నాలజీ లో 10వ స్థానం లోనైనా ఉన్నామా? చాలమంది ఈ మేటర్ చదివితే గూగుల్, మైక్రోసాఫ్త్ కంపెనీలు మన దేశ కంపనీలు అనుకుంటారు. మనం కేవలం CM గారు చెప్పిన కంపెనీలకు లేబర్ ను సప్లై చేస్తున్నం అంతే., మనం సృష్టించిన అటువంటి అత్యున్నత సాంకేతిక సంస్థలు ఎన్ని ఉన్నాయి, నాకు ఒక్కటీ గుర్తు రావట్లేదు..

4. ఆ డాక్తరును CM గారు పొగిడిన పద్దతి చూస్తోంటే, ఇక బాగా చదువుకున్న పిచ్చి జనాలు అధ్యాత్మికతే జీవిత శైలి అని అదే బాట పడతారేమో అని భయమేస్తోంది.

ఈయన రాష్ట్రాన్ని, దానితో పాటు ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నారా? ఎటో ఒక్కసారి ఆలోచిద్దామా ?