మహావీర్‌ కర్ణగా విక్రమ్‌

Posted on : 09/01/2018 02:54:00 am

              విక్రమ్ తన తండ్రి వినోద్ రాజ్ మరణం తర్వాత బాధ నుంచి తిరిగి సాధారణ స్థితికి వచ్చాడు. అతని తండ్రి వినోద్ రాజ్ గత వారం మరణించిన సంగతి తెలిసిందే. ఇపుడు తన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ మీద దృష్టిపెట్టాడు.ఆదివారం విక్రమ్ Instagram లో ఒక అద్భుతమైన  ప్రకటన చేశాడు. తాను త్వరలో మహాభారతంలోని కర్ణుడి పాత్ర నటించబోతున్నట్లు అయన అభిమానులకి ఈ ప్రకటన ద్వారా తెలిపారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహావీర్‌ కర్ణ’ పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. చారిత్రాత్మక కాలానికి చెందిన మహావీర్ కర్ణను RS విమల్ దర్శకత్వం వహించనున్నారు అని ప్రకటించాడు, RS విమల్ 2015 లో మలయాళ చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా విమర్శనాత్మక ప్రశంసలు పొందిన సినిమా ఎన్ను నింతే మొయిద్దీన్ ద్వారా పరిచయం అయ్యారు.
             RS విమల్ మహావీర్‌ కర్ణని పాన్ ఇండియన్ ఫిల్మ్ గ రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించనున్నారు .ఈ చిత్రం గురించి అడగటానికి విక్రమ్ వద్దకు వచ్చినప్పుడు, అతను వెంటనే అంగీకరించాడు. ఈ చిత్రం యునైటెడ్ ఫిలిం కింగ్డమ్ అనే న్యూయార్క్ లోని ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుంది అని దర్శకుడి చెప్పారు.
 ఈ చిత్రాన్ని ప్రధానంగ హిందీలో చిత్రీకరించనున్నారు , అలాగే ఇది తమిళం, తెలుగు మరియు మలయాళం వంటి ఇతర ప్రాంతీయ భాషలలో కూడా డబ్బింగ్ అవుతుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు భావోద్వేగ అనుగుణంగ, అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఈ చిత్రంలో పని చేస్తారని, అలాగే వివిధ భారతీయ భాషల నుండి ప్రముఖ నటులలో ఈ చిత్రం చేయనున్నట్టు అయన చెప్పారు.
         విక్రం ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు చేస్తున్నారు, అందులో ఒకటి - సామీ స్క్వేర్ (saami square ), తన సూపర్ హిట్ కాప్ యాక్షన్ చిత్రం సామీ చిత్రానికి సీక్వెల్ గ వస్తుంది, మరి చిత్రం దర్శకుడు గౌతమ్ మీనన్ తో ఒక స్పైథ్రిల్లర్ ధ్రువ నక్షత్రం, ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది, అలాగే సామీ స్క్వేర్ రంజాన్ కు విడుదల అవుతుంది.