అదరగొడుతున్న భాగమతి ట్రైలర్

Posted on : 09/01/2018 06:00:00 pm

అరుంధతి తరువాత, ఆ స్థాయి అంచనాలతో మన ముందుకు వస్తున్నా అనుష్క కొత్త చిత్రం భాగమతి ..ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ కొద్దీ సేపటి క్రితమే విడుదలై మంచి ఆదరణ ని పొందుతుంది.యూవీ క్రియేషన్స్ ఏంత్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పిల్ల జమీందార్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు.
బాహుబలి లో దేవసేనగా మెప్పిచ్చిన అనుష్క చాల విరామం తరువాత చేసిన చిత్రం భాగమతి ..ఈ ట్రైలర్ చుస్తునంత సేపు విజువల్స్ ప్రేక్షకుడిని కట్టి పడేస్తాయి ..అంతే కాకా ఈ మధ్య నేపధ్య సంగీతం తో ఆకట్టుకుంటున్న థమన్ మరోసారి ఈ చిత్రానికి తన ప్రతిభని చూపాడు.ట్రైలర్ తో అన్ని రకాలుగా మెప్పించిన ఈ చిత్రం చూడాలంటే జనవరి చివరి వరం వరకు ఆగాల్సిందే మరి.