విమానాన్ని గాలికొదిలేసి..

Posted on : 09/01/2018 05:05:00 pm

నింగిలో వెళ్లున్న విమానాన్ని దాని మానాన దాన్ని వదిలేసి తన్నుకున్న ఇద్దరు సీనియర్ పైలట్లపై వేటుపడింది. జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ ఈ గొడవను చాలా  సీరియస్‌గా తీసుకుంది. ఈ నెల 1న లండన్ నుంచి ముంబైకి వస్తున్న విమానంలో ఈ ముచ్చట జరిగింది.

బోయింగ్ 777 (9డబ్యూ119)లో సీనియర్ పైలట్ల మధ్య ఏదో గొడవ జరిగింది. దీంతో వారిద్దరూ కాక్ పిట్ బయటకొచ్చి కొట్టుకున్నారు. దీంతో ప్రయాణికులు, తోటి సిబ్బంది  భయాందోళనలకు గురయ్యారు. చివరకు సిబ్బంది జోక్యంతో పైలట్లు వెనక్కి తగ్గి విమానాన్ని కిందికి దించారు. ఈ ఘటనపై జెట్ ఎయిర్‌వేస్ విచారణకు ఆదేశించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా తీవ్రంగా స్పందించారు. ఆ ఇద్దరు పైలట్ల లైసెన్స్‌లను రద్దు చేసి, ఇక నుంచి వారు పైలట్లలా కాకుండా మామూలు ప్రయాణికులుగా మాత్రమే విమానాల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.