ఆయుర్వేదం శాస్త్రీయ వైద్యమేనా?

Posted on : 09/01/2018 05:15:00 pm

కర్ణాటక లోని సివమోగ్గ దగ్గరలోని నర్శిపుర లో వైద్య నారాయణ మూర్తి అనే ఆయన క్యాన్సర్ కి ఆయుర్వేదిక్ మందు ఇస్తున్నారు. ఇంకా ఎన్నో వ్యాధులకి మందులు ఇస్తున్నారు. వాడిన వాళ్ళు చాలామంది పనిచేసింది అనే చెప్తున్నారు.


నా స్నేహితుడి తల్లికి కూడా లివర్ క్యాన్సర్ 4త్ స్టేజ్ లో ఉంది.
ఆకలి లేదు, విసర్జన అసలే లేదు , విపరీతమైన నొప్పి తో బాధ పడ్డారు. Hyderabad loni బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ , మరియు విజయవాడ తాడేపల్లి లోని మణిపూర్ హాస్పిటల్ లో కూడా చూపించడం జరిగింది. రెండుచోట్ల ఒకే సమాధానం చెప్పారు. మందులతోటి అయితే maximum 6months కీమోథెరపీ చేస్తే maximum 1yr, శరీరం కూడా క్షీణించి పోతుంది అది కూడా మీ మనసృప్తి కోసం చేయడమే అని చెప్పారు.


ఏమి చెయ్యాలో అర్ధం కాక వేరే దారులు వెతకడం మొదలెట్టారు.

ఒక్కొక్కళ్ళు ఒక్కో సలహా చెప్పేసరికి వాడి బుర్ర హీట్ ఎక్కింది, ఎవరో గుజరాత్ లో గోవు పంచగవ్య తో cure చేస్తారని చెపితే, ఆశతో valsad వెళ్ళడానికి సిద్ధమై తత్కాల్ రిజర్వేషన్ కోసం, గుంటూరు దగ్గర లోని సిరిపురం రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ రిజర్వేషన్ చేయించే క్రమంలో అక్కడి స్టేషన్ మాస్టర్ గారు మాట్లాడుతూ ..... ఇలాంటి పరిస్థితే సిరిపురం లోని ఒకవిడకు వస్తె వాళ్ళు కర్ణాటక లో ఎక్కడికో వెళ్ళి వైద్యం చేయించారు ఇప్పుడు కోలుకుని బాగానే ఉంది అని చెప్పగానే ... మా స్నేహితుడిలో కొత్త ఆశ ....
ఆవురిలో ఆవిడ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాము. వారి కొడుకు నీ కలిస్తే వారిది కూడా నా స్నేహితుడి తల్లి లాంటి పరిస్థితే అని తెలిసింది వారుకూడా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో రోజులు మందులు వాడి చివరికి ఆక్కడికి వెళ్లారట. గత 5 నెలలుగా ఆ మందిని వాడుతున్నరట. రిపోర్ట్ లో కూడా తేడా వచ్చిందట. ఆకలి పెరిగి బరువు పెరిగి ఇప్పుడు చూడడానికి ఆరోగ్యం గా ఉన్నారు. ఇవన్నీ వినగానే , గుజరాత్ పోయి బుర్రలోకి నర్సిపుర వొచ్చింది. అక్కడ గురువారం , ఆదివారం మాత్రమే మందులు ఇస్తారట అనుకున్నద తడవు రాత్రికి రాత్రే అక్కడికి బయడేరాడం జరిగింది , బుధవారం సాయంత్రానికి అక్కడకి చేరుకుని చూస్తే, అప్పటికే అక్కడ దాదాపు 300 వందలమంది , మరుసటి రోజు క్యూలైన్ కోసం అప్పటికే వరసలో దుప్పట్లు పరిచారు.

గురువారం ఉదయం అయ్యేసరికి , జాతరకు వోచినట్టు జనం విచ్చేశారు, వొచ్చిన వార్లో 90% మంది క్యాన్సర్ మందు కోసమే నట. చిత్రమేమిటంటే, ఈ మందు కోసం Australia, USA నుండి కూడా విదేశీయులు కూడా వోచారు.

క్యూలైన్ లో ఉన్నంత సేపు లో చాలా సేపు ఇంతకు ముందు ఈ మందు వాడిన వారిని విచరించడమే జరిగింది. అందరూ బాగా పనిచేస్తుంది అందుకే వోచాము అనేసరికి ఆశ ఇంకా పెరిగింది.

నానా తంటాలు పడి గురువారం మధ్యాహ్నం 3 గంటలకి లోపలికి వెళ్ళాము. అక్కడ అడిగింది రెండే ప్రశ్నలు, ఏ క్యాన్సర్?? ఎన్నో స్టేజ్?? అది చెప్పగానే ఒక పండు ముసలాయన తన చుట్టూ ఉన్న వాటిలోంచి కోన్ని పొడులు కలిపి వాటిని ఇచ్చారు, ఒక్కమాట చెప్పారు 4th స్టేజ్ అంటే కొంచెం కష్టమే , కొంచెం టైం పడుతుంది అన్నారు.

మందులతో పాటు, వాటిని ఉపయోగించే పద్దతి తో కూడిన పత్యం పేపర్ కూడా ఇచ్చారు. ఒకరికి ఒక నెల కి సరిపడా మందు మాత్రమే ఇస్తారు. ఇద్దరు వెళ్ళడం వల్ల రెండునెలల కి సరిపడా దొరికాయి. నెలకి మందులు 300rs.

ఇప్పటికీ ఒకనెల గడిచింది ఇప్పుడు ఆకలి బాగా వేస్తుంది, విసర్జన కూడా బాగానే ఉంది. నొప్పికుడా కూడా తగ్గిపోయింది. కాకపోతే మందుల వల్ల కడుపులో కొంచెం మంటగా ఉంటుంది.


ఆవిడకి ఇప్పటికీ క్యాన్సర్ ఉన్న సంగతి తెలియదు లోపల ఏదో గడ్డ ఉంది అని మాత్రమే తెలుసు.

ఇదంతా చూశాక నాకొచ్చిన సందేహం ఒకటే, ఆయుర్వేదం అనేది శాస్త్రీయమైన వైద్యమెనా??? కాదా ?? అని.

అసలు ఆయుర్వేదం శాస్త్రీయం అవునో కాదో తెలుపగలరు.
పై వివరణ అంతా సమస్య పూర్తిగా అర్థం అవడం కోసమే పెట్టాను.


తెలిసిన వారు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపగలరు.