థియేటర్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు

Posted on : 09/01/2018 06:07:00 pm

సెంట్రల్ గవర్నమెంట్ విన్నపం తరువాత సుప్రీమ్ కోర్ట్ థియేటర్లలో జాతీయగీతం విషయంలో కాస్త వెనక్కి తగ్గింది, సుప్రీమ్ కోర్ట్ తాజా ఆదేశాల ప్రకారం సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపించడం తప్పనిసరి కాదు. నవంబర్ 2016 లో కోర్ట్ తీసుకున్న నిర్ణయానికి ఇది తాజా సవరణ.
        చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్ర, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది మంత్రుల బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబర్లో ఉన్నత న్యాయస్థానం ప్రజలలో  దేశభక్తిని బలవంతంగా మోపలేమని పేర్కొన్న అనంతరం కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. జాతీయ గీతం వినినప్పుడు ఒక వ్యక్తి నిలబడకపోతే అతడు లేదా ఆమెకి తక్కువ దేశభక్తి ఉంది అని అర్ధం కాదు అని కోర్ట్ అభిప్రాయపడింది.
      సమాజానికి మోరల్ పోలీసింగ్ (నైతిక విలువలు ) అవసరం లేదని, ఇది ఇలాగే కొనసాగితే ఆ తరువాత ప్రజలను సినిమాకి టీ-షర్టులు, షార్టులు వేసికొని రావడం వల్ల జాతీయ గీతాన్ని అగౌరవం అని చెప్పాల్సి ఉంటుంది అని అన్నారు.
      ఏది ఏమి అయినా ఈ తాజా నిర్ణయం హర్షించాల్సిందే, దేశ భక్తి బలవంతంగ రుద్దితే వచ్చేది కాదు, అది ఎవరికీ వారుగా అలవరచు కోవలసిన విషయం. అలాగే ప్రజాస్వామ్య దేశంలో నువ్వు ఎలా ఉండాలి అని పౌరులను బలవంత పెట్టకూడదు, వారికీ ఇష్టం వచ్చ్చినట్టు వుండే హక్కు వుంది.