చేతులెత్తేసిన భారత జట్టు

Posted on : 09/01/2018 06:17:00 pm

సులువుగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ జట్టు చేతులు ఎత్తేసింది. దక్షిణాఫ్రికాతో ఈ నెల 5న మొదలైన మొదటి టెస్ట్ లో భారత్ ఘోర పరాభవం పాలైంది. దక్షిణాఫ్రికా చాలా సులువుగా భారత దేశం పై విజయాన్ని సొంతం చేసుకుంది.
 4వ రోజు వర్షం తరువాత మొదలైన ఆటలో దక్షిణాఫ్రికా 130 పరుగులకు కుప్పకూలింది, దీంతో భారత జట్టు కి 208 లక్ష్యాన్ని ముందు ఉంచింది .ఆ తరువాత లక్ష్య సాధనకై రంగంలోకి దిగిన భారత బాట్స్మెన్ ఎక్కడ కూడా తమ ప్రతిభని చూపలేక పోయారు, వెర్నాన్ ఫిలాండర్ తన బంతి తో భారత బాట్స్మెన్ ని ఒక్కొక్కరిగా పెవిలియన్ వైపు పరుగులు పెట్టించాడు. వెర్నాన్ ఫిలాండర్ తన కెరీర్ లో ఉత్తమ ప్రదర్శన ( 6-42) కనబరిచి దక్షిణాఫ్రికా కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. వెర్నాన్ ఫిలాండర్ ఉత్తమ ప్రదర్శన వాళ్ళ దక్షిణాఫ్రికా 72 పరుగుల తో భారత్ పై విజయం సాదించి 3 టెస్టుల సిరీస్ లో 1-0 తో ముందంజలో ఉంది.
 ఆట మొదలైన గంట వ్యవధిలోనే నలుగురు బాట్స్మెన్ ని కోల్పోయిన దక్షిణాఫ్రికా 27 పరుగులు మాత్రమే చేయగలిగింది ఆ తరువాత ఎబి డీవీలర్స్ మాత్రమే జట్టు ను కాపాడగలిగాడు ఒక దశలో భరత్ బౌలర్లు దక్షిణాఫ్రికాను వీలైనంత వరకు కట్టడిచేయగలిగారు. మొత్తం 130 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా భారత్ కు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ తరువాత బరిలోకి దిగిన భారత్ బాట్స్మెన్ మురళీ విజయ్, శిఖర్ ధావన్ భోజనం తర్వాత మొదటి అర్ధగంటలో 30 పరుగులు చేశారు కానీ భారత్ 39 పరుగులకే మూడు కీలక వికెట్లు(మురళి విజయ్, ధావాన్, పుజారా) కోల్పోయి కష్టకాలం లో పడింది .
అదే సమయంలో భారత ఆశాదీపం పరుగుల యంత్రంగా పిలుచుకునే జట్టు సారథి కొత్త పెళ్లి కొడుకు విరాట్ కోహ్లీ రావటంతో ఒక్కసారిగా బలం వచ్చినట్లైంది. కోహ్లీ ఎప్పటిలాగే తన ఆటను మొదలెట్టాడు, అవకాశం వచ్చిన ప్రతిసారి ఉపయోగించుకొని బంతిని బౌండరీస్ వైపు మళ్లించే ప్రయత్నం చేసాడు. జట్టు స్కోరును నెమ్మదిగా పెంచుతూ వస్తున్న సారధి కోహ్లీ ని ఫిలంధర్ LBW చేసి భారత్ ఆశలు అడియాశలు చేసాడు. వెంటనే హిట్ మాన్ రోహిత్ శర్మ కూడా 10 పరుగులు చేసి ఫిలాండర్ కి దొరికిపోయాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 8 పరుగులు మరియు హార్దిక్ పాండ్య 1 పరుగులు చేసి రబడా చేతిలో అవుట్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన అల్రౌండ్ర్ర్ రవిచంద్రన్ అశ్విన్ మోరోసారి భారత విజయాన్ని భుజాన వేసుకొనే ప్రయత్నం చేసాడు అతను 37 పరుగులు చేసిన సమయంలో ఫిలాండర్ వేసిన బంతి డే కాక్ కి క్యాచ్ ద్వారా అశ్విన్ వెనుదిరగాల్సి వచ్చింది. ఇక భారత ఓటమి తప్పదు అని తెలిసి కూడా భువనేశ్వర్ కుమార్(13 నాటౌట్), మహమ్మద్ షమీ(4), జస్మిత్ బుమ్రా(0) తమవంతు ప్రయాతం చేశారు కానీ లాభం లేకపోయింది.