వీసా నిబంధనలో ఎటువంటి మార్పు లేదు : అమెరికా

Posted on : 09/01/2018 06:56:00 pm

 భారతీయ టెక్కీలకు శుభవార్త, వీసా నిబంధనలో ఎటువంటి మార్పు లేదు అని US ఇమ్మెగ్రేషన్ వర్గాలు తెలిపాయి, ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది, ఈ విషయాన్నీ US సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) మరియు ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు, మొన్నటి దాక వీసా పొడిగింపు (వీసా ఎక్సటెన్షన్ ) నిలుపుదల చేస్తున్నట్టు అనేక కధనాలు మీడియాలో వినిపించాయి. 7,50,000 మంది భారతీయులకి ఏది పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.
           గత జనవరి నుంచి హ్1బి (H1B) వీసాలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేస్తుంది అని చాల కదనాలు వచ్చాయి, అలాగే వీసా ఎక్సటెన్షన్ కూడా ఆపేస్తున్నట్లు వచ్చిన వార్తలు భారతీయ టెక్కీలను వణికించాయి అనే చెప్పాలి, తాజా సమాచారంతో అటువంటిది ఏమి లేదు అని స్పష్టం అయింది, ఈ వార్త భారతీయ టెక్కీలకు, ఐటీ సంస్థలకు సరికొత్త ఉత్సాహాన్నిస్తుంది.
      ప్రతి సంవత్సరం USCIS నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అమెరికా రావడానికి హ్1బి వీసా ప్రోగ్రాం ద్వారా 60,000 మందికి ప్రపంచ వ్యాప్తంగా అవకాశం కలిపిస్తుంది, అలాగే 20,000 మంది అమెరికాలో మాస్టర్స్ చేసిన విద్యార్థులకు ఈ వీసా అవకాశం ఇస్తుంది.