మోడీ నోరు విప్పాల్సిందే: జిగ్నేష్ మెవని

Posted on : 09/01/2018 07:59:00 pm

 మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికల్లో  జిగ్నేష్ మెవని ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ దళిత నాయకుడు మంగళవారం యువ హుంకార్ ర్యాలీలో బీజేపీ పైన నిప్పులు చెరిగారు, బీజేపీకి 150 స్థానాలు రాకుండా  'హార్దిక్ పటేల్ , అల్పేష్ ఠాకూర్ అండ్ జిగ్నేష్ మెవని ' కలిసి అడ్డుకున్నామని చెప్పడం జరిగింది.  

 మెవని ప్రధాన మంత్రిపై ఘాటుగానే ప్రశ్నల వర్షం కురిపించాడు ' భీమా కోరేగావ్‌లోని సహారన్‌పూర్‌లోని దళితులపై హింసాకాండకు కారణం ఏమిటి? రోహిత్ వేముల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? విదేశీ ఖాతాల్లో ఉన్న భారతీయుల సొమ్ము ఎందుకు వెనక్కి రావటం లేదు? భారత దేశంలో యువతకు ఉద్యోగావకాశాలు ఎందుకు సన్నగిల్లుతున్నాయి?' ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి తీరాలి అని పేర్కొన్నారు.

 అవినీతి, పేదరికం, నిరుద్యోగం ఈ సమస్యలన్నిటినీ కప్పి పెట్టారు. మాకు లవ్ జీహాదిపై నమ్మకం లేదు, మేము ప్రేమను మాత్రమే నమ్ముతాం. నేను నా నియోజకవర్గాన్ని కాపాడుకుంటాను, అభివృద్ధి చేస్తాను, మీరు నా మీద దాడి చేసినా నేను భయపడను రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను. ఇంకా మాట్లాడుతూ 'నేను కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాడినే మోడిజీ నేను ఇప్పుడు ఎంఎల్ఎగా ఉన్నాను,ఇప్పటికైనా నా మాటైనా వినండి' అని అన్నారు.

ఇంకా ఈ ర్యాలీ లో కన్నయ్య కుమార్ షెహ్ల రషీద్ మరియు ఉమర్ ఖాలిద్ మరియు అస్సాం ఫార్మర్స్ లీడర్ అఖిల్ గొగోయ్ లతో సహా మాజీ, ప్రస్తుత JNU విద్యార్థి నాయకులు కూడా ర్యాలీలో ప్రసంగించారు. ఉత్తర ప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లాలోని ఠాకూర్-దాలిత్ ఘర్షణలకు సంబంధించి గత ఏడాది అరెస్టు చేసిన భీం ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలన్న డిమాండ్‌ను ఈ ర్యాలీ ధృవీకరించింది.

 NGT ఆదేశాల మేరకు జంతర్ మంతర్ వద్ద ఎటువంటి నిరసనలు, ర్యాలీలు నిర్వహించవద్దని ఢిల్లీ రక్షక భటులు మెవనికి, ఇతరులకు అనుమతులు తిరస్కరించారు. నిర్వాహకులు జంతర్ మంతర్ వద్ద కాకుండా పార్లమెంటు స్ట్రీట్‌లో తమ నిరసన వక్తం చేస్తున్నట్లు తెలిసి NTG అక్కడ కూడా ఆంక్షలు విధించింది. " ఇది చాల దురదుష్టకరం మేము ప్రజాస్వామ్య బద్దంగా, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే ప్రభుత్వం మాకు అడుగడుగునా ఆటంకాలు కలిపిస్తుంది. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకే తమ స్వేచ్చని వ్యక్తపరచనీయకుండా అడ్డుకుంటుంది" అని మెవని ర్యాలీ ప్రారంభానికి ముందే చెప్పారు.

 ర్యాలీ అనంతరం నిర్వాహకులు భారత రాజ్యాంగం మరియు 'మనుస్మృతి' యొక్క నకలును ప్రధానమంత్రి మోడీకి ఇవ్వటానికి లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ఉన్న అధికారిక నివాసానికి వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.