పద్మవత్ కి 300 సెన్సార్ కట్లు

Posted on : 09/01/2018 08:59:00 pm

సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వం లో వస్తున్న చారిత్రాత్మక చిత్రం పద్మావతి పేరు పద్మావత్ గా మార్చారు అన్నది తెలిసిన విషయమే, ఈ చిత్రం జనవరి 25 న విడుదల అవుతుంది. కావున ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తి కరమైన వార్త ఒకటి బయటకి వచ్చింది, అది వింటే జనాలు ముక్కున వేలువేసుకుంటారు.
       సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి కొన్ని మార్పులు సూచించిన తర్వాత థియేటర్లో రిలీజ్ చేయడానికి పచ్చజండా ఊపింది అని తెలిసినది, తాజాగా అందిన సమాచారం మేరకు CBFC ఈ చిత్రానికి ఏకంగా 300 కత్తిరింపులు చేసింది అని తెలిసింది. ఒక చిత్రానికి 300 కత్తిరింపులు అంటే అది మామూలు విషయం కాదు, దాదాపుగా సినిమా మొత్తానికి మార్చినట్టే అవుతుంది. ఇన్ని కత్తిరింపుల తర్వాత డైరెక్టర్ అనుకున్న కథ ఎక్కడ ఉంటుంది, దాని ఆయువు ఎక్కడ ఉంటుంది, ఈ లెక్కన చుస్తే సినిమా అంతా CBFC డైరెక్ట్ చేసినట్టు అవుతుంది.
           2016 లో ఊడ్త పంజాబ్ సినిమాకి అత్యధికంగ 94 కత్తిరింపులు చేసింది సెన్సార్ బోర్డు, పంజాబ్ అనే ఒక పదాన్ని టైటిల్లో తీసివేయలేదని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని దాని డిమాండ్ పడగొట్టాలి అని సెన్సార్ బోర్డు అన్ని కత్తిరింపులు చేసింది అనేది అందరికి తెలిసిన విషయమే. ఉద్టా పంజాబ్ విషయంలో, నిర్మాతలు ఏక్తా కపూర్ మరియు అనురాగ్ కశ్యప్ లు ముంబై హై కోర్ట్ ని ఆశ్రయించడంతో కొద్దిపాటి కత్తిరింపులతో అది విడుదల అయింది.
             కానీ పద్మవత్ విషయంలో ఇలా రూ. 180 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే ఆలస్యం అవడం వల్ల చిత్ర నిర్మల సంస్థ వయాకామ్ మోషన్ పిక్చర్స్ ఇప్పటికే చాల నష్టపోయింది, ఇపుడు కోర్ట్ కి వెళ్తే ఈ చిత్రం విడుదల ఇంకా ఆలస్యం అయి నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశం వుంది. అందుకే CBFC సూచించిన అన్ని మార్పుల తర్వాత ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకి సిద్ధం అయింది.