చుక్క‌లు చూపిస్తున్న అజ్ఞాత‌వాసి

Posted on : 09/01/2018 10:58:00 pm

అజ్ఞాతవాసి సినిమా టిక్కెట్లు బ్లాక్ మార్కెట్లో భ‌గ్గుమంటున్నాయి.రెండు  తెలుగు రాష్ర్టాల్లో  ఒక్కో టిక్కెట్టు  ధ‌ర రూ. 1000 నుంచి రూ. 1500 వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతోంది.ధియోట‌ర్ల‌లో షోలు.. వేస్తున్నారు.. మున్నెన్న‌డూ లేని విధంగా మ‌ల్టీప్లెక్సుల్లో ఆర్ధ‌రాత్రి షోల‌కు  అనుమ‌తించారు. ఒక్కో ధియోట‌ర్ల‌లో 7 షోలు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.  బ్లాక్ టిక్కెట్ల పై ప‌వ‌ర్ స్టార్ అభిమానులు మండిప‌డుతున్నారు. కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు  పాట వివాదాస్ప‌దంగా మారింది. అయితే విజ‌య‌వాడ న‌గ‌రానికి చెందిన ఓ న్యాయ‌వాది మాచ‌వ‌రం  పోలీస్ స్టేస‌న్ లో ఇప్ప‌టికే ఫిర్యాదు చేశాడు.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల్ని అజ్క్షాత వాసి ఫీవ‌ర్ ముంచెత్తుతోంది. ప‌వ‌ర్ స్టార్  25వ సినిమా కావ‌డం, మాట‌ల మాంత్రికుడు  త్రివ్రిక‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపుదిద్దుకోవ‌డంతో సినిమాకు క్రేజ్ పెంచింది. దీన్ని తెలివిగా సొమ్ము చేసుకోనేందుకు సినీ డ్రిస్టిబ్యూట‌ర్లు తెగ‌బ‌డుతున్నారు. ప్ర‌భుత్వం నుంచి అర్ధ‌రాత్రి షోల‌కు అనుమ‌తుల్ని సంపాదించారు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 1 గంట నుంచి ప్ర‌ద‌ర్శించ‌బ‌డ‌నుంది. బెనిఫిట్ షో టిక్కెట్ రూ. 1000, నుంచి 1500 వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతోంది. కొన్ని ధియోట‌ర్ల‌లో సాధార‌ణ షో టిక్కెట్ రేట్ల‌ను యాజ‌మాన్యం పెంపుద‌ల చేసింది. దీనిపై అభిమానులు ఆందోళ‌న‌ను దిగుతున్నారు.  స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ చేరుకొని  అభిమానుల్ని చెద‌ర‌గోట్టారు. ధియోట‌ర్ల వ‌ద్ద ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు పోలీస్ బ‌ల‌గాల‌ను రంగంలోకి దించుతున్నారు. టిక్కెట్ల బ్లాక్ మార్కెట్ పై పోలీస్ , రెవెన్యూ వ‌ర్గాలు ఉదాశీనంగా వ్య‌హ‌రించ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
పాట వివాదం
 అజ్క్షాతవాసి చిత్రంలోని కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు పాట‌పై వివాదాం చెల‌రేగింది. కోటేశ్వ‌ర‌రావు అని పేరు ఉన్న వారు మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా సాంగ్ ఉంద‌ని విజ‌య‌వాడ కు చెందిన న్యాయ‌వాది కోటేశ్వ‌ర‌రావు మాచ‌వారం పోలీస్ స్టేష‌న్ లో  ఫిర్యాదు చేశారు. సినిమా నిలుపుద‌ల చేయాల‌ని లేదా సినిమా క‌లెక్ష‌న్ ను కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంద‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ర్టాల్లో అజ్ఞాత‌వాసి హాట్ టాపిగ్ మారింది.