రేవంత్ ఓ బ్రహ్మోస్ మిసైల్.. తెరాస కథను ముగిస్తాడు

Posted on : 04/12/2018 06:27:00 pm


రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని అడిగింది. పోలీసుల తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రేవంత్‌తో పాటు మరికొందరి అరెస్టులకు సంబంధించి కారణాలను రేపు సమర్పిస్తామని ఏజీ... కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను న్యాయస్థానం రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. 

రేవంత్ రెడ్డి అరెస్టు పైన హైకోర్టు ప్రభుత్వానికి చురకలు అంటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రచారం నేపథ్యంలో బంద్ పాటిస్తే తప్పేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ఆయనను అరెస్టు చేయడానికి ఆధారాలు ఏమిటని అడిగింది. రేవంత్ వల్ల శాంతిభద్రతల సమస్య ఎలా తలెత్తుతుందో చెప్పాలని అడిగింది. ఒకవేళ ఆయనను అరెస్టు చేయకుంటే శాంతిభద్రతల సమసమయ ఎలా తలెత్తుతుందో చెప్పాలని ప్రశ్నించింది.

ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అరెస్టు చేశామని చెప్పగా, అందుకు సంబంధించిన కాపీ ఇవ్వాలని అడిగింది. ఆయన అరెస్టుకు సంబంధించిన ఆధారాలు రేపు ఇస్తామని పోలీసులు తెలపగా.. ఓ సమయంలో సక్రమంగా అరెస్టు చేస్తే ఆధారాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. ఈ రోజే ఆధారాలు ఇవ్వాలని అంతకుముందు చెప్పింది. ఆ తర్వాత రేవంత్‌ను విడుదల చేయాలని ఈసీ చెప్పింది. అనంతరం ఆయనను విడుదల చేశారు. ఇదే విషయాన్ని సాయంత్రం కోర్టుకు చెప్పిన ఏజీ.. అరెస్టుకు సంబంధించిన వివరాలు రేపు ఇస్తామని చెప్పారు.

కొడంగల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో భారీ భద్రత మధ్య కొడంగల్ తీసుకు పోయారని తొలుత భావించారు. అయితే ఆయనను కొడంగల్ కాకుండా హైదరాబాద్ తరలించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా రేవంత్ అరెస్టును నిరసిస్తూ తెలంగాణలో పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చారు. గజ్వెల్‌లో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు.