ఆమె కోసం..

Posted on : 09/01/2018 11:42:00 pm

దుర్గగుడిలో హోమాల‌పై ప్ర‌భుత్వం విచార‌ణకు ఆదేశించింది. దీంతో ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు రంగంలోకి దిగాయి. విచార‌ణలో దిమ్మ‌తిరిగే నిజాలు వెలుగు చూస్తున్నాయి. లోకా క‌ళ్యాణార్ధం, భ‌క్తుల కోసం హోమాలు జ‌ర‌గాల్సి ఉండ‌గా  పూర్వ‌పు ఈవో సూర్య‌కుమారి త‌న కోసం ప్ర‌త్యేకంగా చేయించుకోవ‌డం పై చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమె వ‌చ్చిన‌ప్ప్టి నుంచి కొండ దిగే  వ‌ర‌కు ఎన్ని హోమాలు జ‌రిగాయ‌న్న విష‌యాల‌పై కూపీలాగుతున్నారు. తాంత్రిక పూజ‌లు ఆమె కోస‌మే జ‌రిగాయ‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలిన‌ట్లు స‌మాచారం.

దుర్గ‌గుడికి ఈవోగా వ్య‌హ‌రించిన సూర్య‌కుమారి గ‌త ఏడాది ఘాట్ రోడ్డు మూసివేసిన స‌మ‌యంలో ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం వెనుక భాగాన హోమాలు చేయించుకున్నారు.. అయితే స‌ద‌రు హోమాలు, పూజ‌లు లోక‌క‌ళ్యాణార్ధం అయితే భ‌క్తులు ఎందుకు పాల్గొన‌లేదు.. భ‌క్తులు పాల్గొనే అవ‌కాశం ఎందుకు కల్పించ‌లేదు. ఈ హోమం , పూజ‌ల‌ను  వేదాంతం రాజ‌గోపాల్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌కు తెలిసిన వారితో చేయించిన‌ట్లు స్ప‌ష్టంగా చిత్రాల్లో క‌న‌బ‌డుతొంది. ఆల‌యానికి సంబంధం లేని వారు ఇంద్ర‌కీలాద్రిపై పూజ‌లు జ‌రిపించ‌డానికి గ‌ల కార‌ణ‌లేమీటి.. ఆల‌యంలో వేద‌పండితులు, అర్చ‌క‌స్వాములు ఉండ‌గా ఇత‌రులు వ‌చ్చి పూజ‌లు చేస్తే స్వ‌యంగా సూర్య‌కుమారి పాల్గొన్నారు. వ్య‌క్తి గ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే ఈ హోమం, పూజ‌లు చేయించుకున్నార‌నే విమ‌ర్శ‌లు  సూర్య‌కుమారి ఎదుర్కొన్నారు. దుర్గగుడి ప్ర‌ధాన అర్చ‌కులు , వైదిక క‌మిటీ స‌భ్యులు, స్థానాచార్యులు , అర్చ‌క‌స్వాములు ఎవ‌రూ ఈ హోమం, పూజ‌లో క‌ల్పించ‌లేద‌నే విష‌యాన్ని నిఘా వ‌ర్గాలు ధృవీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. అధికారి తొలి నుంచి త‌న వ్య‌క్తి గ‌త స్వ‌ప్ర‌యోజ‌నాల కోస‌మే ఆయలంలో పూజ‌లు చేయించుకుటున్నార‌నే విష‌యాల‌పై నిఘా వ‌ర్గాలు దృష్టి సారించి ఆ దిశ‌గా విచార‌ణ చేప‌డుతున్న‌ట్టు  విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే ఇటీవ‌ల అర్ధ‌రాత్రి ఆల‌యంలో పూజ‌ల విష‌యంలో విప‌క్షాలు లేని పోని  ఆరోప‌ణాలు గుప్పిస్తూ అధికారిణి కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా ఎందుకు పావులు క‌దుపాయి.. ఈ విష‌యంలో రాష్ర్ట మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీ సూచ‌న‌లు ఉన్నాయో.. అనే కోణాలు  సైతం ఇప్పుడు తెర మీద‌కు వ‌స్తున్నాయి.
దుర్గగుడి చ‌రిత్ర‌లోనే ఇది ప్ర‌థ‌మం
దుర్గ‌గుడి చ‌రిత్ర‌లోనే  ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కస్వాములు , వైదిక క‌మిటీ స‌భ్యులు , అర్చ‌క స్వాములు లేకుండా పూజ‌లు చేయించిన ఘ‌త‌న ఒక సూర్య‌కుమారికే ద‌క్కుతుంద‌ని ఆల‌య వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇంద్ర‌కీలాద్రిపై నిర్వ‌హించే ప్ర‌తి పూజా కార్యక్ర‌మం , హోమాల‌లో దుర్గ‌గుడి అర్చ‌క‌స్వాములు  పాల్గొంటారు. ఇత‌ర‌త్రా అత్యున్న‌త పూజ‌ల్లో నూ దుర్గ‌గుడి అర్చ‌క‌స్వాములు పాల్గొంటారు. అయితే ఈ హోమం, పూజ‌ల్లోనూ ఆల‌యానికి చెందిన అర్చ‌క స్వాములు  జాడ క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు తెర‌మీద‌కు వ‌స్తోంది.