ఎవ‌రీ అజ్క్షాత‌వాసులు..?

Posted on : 10/01/2018 12:08:00 am

అత‌ని వ‌య‌స్సు 35.. ఆమె వ‌య‌స్సు 05.. చ‌నిపోయిన వీరిద్ద‌రిని భార్యాభ‌ర్త‌ల‌ను చేశారు. అంతేనా వీరికో కుమార్తెను సృష్టించి రూ. 75 కోట్ల విలువైన స్థ‌లం స్వాహాకు ప్ర‌య్న‌తించారు. ఎక్క‌డున్నారో తెలియ‌దు. ఎవ‌రో తెలియ‌దు కానీ, ప్ర‌భుత్వ శాఖ‌లను.. కోర్టులో మాత్రం ఏ మార్చే ప్ర‌య‌త్నం చేశారు.  ఇప్పుడీ అజ్ఞాత‌వాసుల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్  సీఐటీ అధికారులు శోధిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను మంగ‌ళ‌గిరిలోని సీఐటీ ప్ర‌థాన కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఎస్పీ లేళ్ల కాళిదాసు వెంట‌క రంగారావు వెల్ల‌డించారు. విజ‌య‌వాడకు చెందిన వ‌ల్లూరు చంద్ర‌శేఖ‌ర‌రావు గుణ‌ద‌ల ఆర్ ఎస్ నెం. 404.2 బిలో 5400 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లం  ఉంది. త‌న‌కు వార‌సుల  లేఖ‌పోవ‌డంతో  సోద‌రుడు  చ‌ల‌ప‌తిరావుకు ఆ ఆస్థిని బ‌ద‌లాయించారు.  ఆయ‌న  త‌న ముగ్గురు పిల్ల‌ల‌కు ఆ ఆస్థి పంప‌కం చేశారు. అప్ప‌టి నుంచి  ఆ స్థ‌లం వారి పేరిట‌నే  ఉంది. వార‌సుల్లో ఒక‌రైన మండ‌వ చిల‌కా రాణి 2010లో ఆ స్థ‌లంలో భ‌వ‌న నిర్మాణం  కోసం ఖాళీ స్థ‌లం ప‌న్ను (వేకెంట్ ల్యాండ్ టాక్స్) చెల్లేందుకు న‌గ‌ర‌పాల‌క సంస్థ వెళ్ల‌గా  వెత్సా గీత ఆనే మ‌హిళ పేరిట ఆ ఆస్థి ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. 2009లో త‌యారైన ఆ డాక్యుమెంటు  ప్ర‌కారం  1987 లో ఆ స్థ‌లాన్ని కొనుగోలు చేసిన‌ట్లు గీత పేర్కొన‌ట్లు అధికారులు  తెలిపారు. అప్ప‌ట్లో దివంగ‌త ఎమ్మెల్యే వంగ‌వీటి మోహ‌న‌రంగారావు  హ‌త్య సంద‌ర్భంగా జ‌రిగిన అల్ల‌ర్ల‌లో  ద‌గ్ధ‌మైన డాక్యుమెంట్ల‌లో త‌మ‌ది కూడా ఉన్న‌ట్లు పేర్కొంటూ డాక్యుమెంట్ల‌ను పున‌రుద్ద‌రించిన‌ట్లు తేలింది. ఇదే డాక్యుమెంట్ల‌తో ఆ ఆ్థి త‌మ‌దేనంటూ వివిధ కోర్టులో సివిల్ దావాలు వేసిన‌ట్లు చిల‌కా కోర్టులో  ప్రేవేటు కేసులు ధాఖ‌లు చేయ‌గా సిఐటీ విచార‌ణ‌కు ఆదేశించారు.
ఆస్తి వార‌సుల‌దే
కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిఐడీ డీఎస్పీ కె. గుణ‌శేఖ‌ర్ అన్ని ఆధారాలు సేక‌రించ‌గా  చిల‌కా రాణి కుటుంబికులే ఆ ఆస్తికి వార‌సుల‌ని  తేలింది. ఈ ఆస్తిని కాజేసేందుకు గుర్తు తెలియ‌ని ముఠా న‌కిలీ ప‌త్రాలు, ఓ కుటుంబాన్ని సృష్టించిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఆ ఆస్తిని కాజేసే క్ర‌మంలో భాగంగా బాంబుదాడిలో గాయ‌ప‌డి గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతూ 1988లో మృతి చెందిన వి. స‌త్య‌నారాయ‌ణ పేరును  వెత్సా వెంక‌ట కృష్ణ‌వేణి గాను పేర్కొంటూ న‌కిలీ మ‌ర‌ణ ధృవ‌ప‌త్రాలు సృషించిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఇందులో వారి కుమార్తెగా పేర్కొన్న వెత్సా గీత బెంగుళూరులోని శాంతి నికేత‌న్ బాలిక‌ల హాస్ట‌ల్ లో ఉన్న‌ట్లు, పాత గుంటూరులోని కొండ‌వారి వీధిలో  ఉన్న‌ట్లు న‌కిలీప‌త్రాలు సృష్టించారు. ఇదే గీత హైద్రాబాద్ అమీర్ పేట‌లోని బ‌ల్కంపేట చిరునామాత త‌యారు చేసిన న‌కిలీ ఓట‌రు గుర్తింపు కార్డును వినియోగించి న్యాయ‌వాదులు సాయంతో విజ‌య‌వాడ, హైద్రాబాద్  కోర్టుల్లో సివిల్ వ్యాజ్యం వేశారు. విచార‌ణ‌లో వెలుగు చేసిన ఆధారాల మేర‌కు విచార‌ణ జ‌రిపిన రిజిస్ర్టేష‌న్ల శాఖ అధికారుల ముఠా రిజిష్ర్టేష‌న్ ను ర‌ద్దు  చేశారు.
ఎవ‌రీ అజ్క్షాత వాసులు..
రూ. కోట్ల విలువైన ఆస్తిని కాజేసేందుకు ముఠా  చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను నిలువ‌రించినప్ప‌టికీ, వారి వివ‌రాల‌ను తెలియ‌డం లేద‌ని ఎస్పీ కాళీదాసు రంగారావు చెప్పారు. వీరు విజ‌య‌వాడ‌లోని ఓ నెట్ సెంట‌ర్ నుంచి వ్యవ‌హారాలు న‌డుపుతున‌ట్లు గుర్తించి సీసీ టీవీ పుటేజ్ లో ఓ అనుమాని వ్య‌క్త‌ని గుర్తించిన్న‌ట్లు తెలిపారు. గీత పేరిట ఉన్న ఓట‌రు కార్డు మార్పింగ్ అయి ఉండోచ్చ‌ని ఆయ‌న చెపుతున్నారు. న్యాయ‌వాదుల‌కు దుక్కిపాటి రామారావు అనే వ్య‌క్తి ద్వారా సంప్ర‌దించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింద‌ని, అయితే ఆ రామారావుకు సంబంధిచిన ఆన‌వాళ్లు కూడా న్యాయ‌వాదుల వ‌ద్ద లేవ‌న్నారు. 1991  డిసెంబ‌ర్ 15న గుంటూరు ఆసుప‌త్రిలో  చ‌నిపోయిన వి. కృష్ణ‌వేణి (5), 1988  జ‌న‌వ‌రి 19న  బాంబు గాయాల‌తో ఇదే ఆసుప‌త్రిలో చ‌నిపోయిన వి. స‌త్య‌నారాయ‌ణ (35) వివ‌రాలు  తెలిసిన‌ట్ల‌యితే స‌మాచారం ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. ఇదే స‌మ‌యంలో వెత్సా గీత, వెత్సా స‌త్య‌నారాయ‌ణ మూర్తి పేరిట ఎవ‌రైనా చెలామ‌ణి అవుతున్నా, మోసానికి గురైన బాధితులున‌నా సీఐటీ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. సీఐడీ డీఎస్పీ గుణ‌శేఖ‌ర్ 94406-27683, 99639-06839కి తెలియ‌జేయ‌డంతో పాటు  ఈ త‌ర‌హా వ్య‌క్తుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.