తొలి భారత విమాన సంస్థగా నిలవనున్న ఇండిగో!

Posted on : 05/12/2018 01:30:00 pm


దేశీయ విమానయాన సంస్థ ఇండిగో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఇండియాలో 200 సొంత విమానాలను కలిగివున్న ఏకైక సంస్థగా ఇండిగో త్వరలో అవతరించనుంది. 12 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఇండిగో, ఇప్పుడు 198 విమానాలను కలిగివుంది. గత నెలలో 7 కొత్త విమానాలు కొనుగోలు చేసిన సంస్థ మరో రెండింటిని కలుపుకుంటే అరుదైన రికార్డును పొందిన సంస్థ అవుతుంది. లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఒకటిగా ఉన్న ఇండిగో, ప్రయాణికులకు సేవలందించడంలో ముందు నిలుస్తూనే ఉంది. కాగా, ఇండిగోకు దగ్గరగా స్పైస్ జెట్ నిలిచి, అత్యధిక విమానాలను కలిగివున్న రెండో అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది.