అవ‌స‌రానికే మోదీ అప్పాయింట్మెంట్ ఇస్తారు : జేసీ

Posted on : 10/01/2018 12:20:00 am

అనంత‌పురం  ఎంపీ జేసి  దివాక‌ర్ రెడ్డి ఎప్ప‌టి మాదిరిగానే త‌న పంచ్ డైలాగుతో మీడియాతో కొద్ది సేపు ముచ్చ‌టించారు. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ తో విజ‌య‌వాడ రైల్వే శిక్ష‌ణ కేంద్రంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీలు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానంత‌రం దివాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడ్తు త‌మ‌ని కేంద్రంలోని  కొంద‌రు క‌రివేపాకులా వాడుకుంటున్నార‌న్నారు. అవ‌స‌రాన్ని సంద‌ర్భాన్ని బ‌ట్టి సీఎం చంద్ర‌బాబు నాయుడుకి అప్పాయింట్ మెంట్ ఇస్తార‌ని ప్ర‌ధాని మోదీ తీరుపై  జేసీ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. రైల్వే జోన్ విష‌యంలో ఎంపీలు చేసేదేమీ లేద‌ని .. చెయ్యెత్త‌మంటే ఎత్తాలి... దించ‌మంటే దించాలి చందంగా ఉంద‌న్నారు. భ‌యం లేక‌పోతే విచ్చ‌ల‌విడి త‌నం వ‌స్తుంద‌న్నాన‌రు. కోడి పందెలు గురించి
వ్యాఖ్యానిస్తూ ఎప్ప‌టిలాగే గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగే పందెల‌కు వెళ్తాన‌ని.. కోడి పందెలు చూస్తే  త‌ప్పేంట‌న్నారు. కాకినాడ ఎంపి తోట న‌ర‌సింహం పిఠాపుంర, కాకినాడు రైల్వే లైన్ గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో జేసి జోక్యం చేసుకుని పిఠాపురం గురించే ప్ర‌స్తావ‌న ఎంటీ పెద్ద‌పురం గురించి మాట్లాడు ఉత్సాహం వ‌స్తుంద‌ని జోక్ చేశారు.