డోప్‌ టెస్ట్‌లో చిక్కిన పఠాన్‌

Posted on : 10/01/2018 12:22:00 am

యూసుఫ్ పఠాన్‌ డోప్‌ టెస్ట్‌లో చిక్కడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. గతేడాది మార్చి 16న న్యూఢిల్లీలో ఓ దేశీవాళి టీ20 మ్యాచ్‌ ముందు నిర్వహించిన డోప్ పరీక్షల్లో పఠాన్ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. కాగా ఈ పరీక్షలో నిషేధిత పదార్థం టెర్బుటలైన్ వాడినట్లుగ తేలింది, ఈ మందు సాధారణంగ దగ్గు మందులో వాడతారు, ఇది వాడే ముందు పఠాన్ బీసీసీఐ కి తెలపాల్సి వుంది కానీ తెలపకపోవడంతో అతనిపై మొదట 18 నెలల శిక్ష వేశారు, ఆ తర్వాత ఈ బరోడా ఆల్‌రౌండర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉండడంతో బీసీసీఐ ఈ శిక్షని 5 నెలలకు కుదించింది.
     తనకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టం అవడంతో తాను దగ్గు మందు వాడినట్టు పఠాన్ తెలిపాడు, దానిలో టెర్బుటలైన్ ఉన్నట్టు తాను గమనించలేదని, చికిత్సలో భాగంగా తాను తెలియక వాడను అని పఠాన్ తెలిపారు. ఇది
 గత సంవత్సరంలో జరగడంతో, ఆగష్టు 15 నుంచి తన నిషేధ సమయాన్ని లెక్కించాలి అని కోరడంతో బీసీసీఐ అంగీకరించింది, దీంతో అతని శిక్ష కాలం ఈ నెలతో ముగుస్తుంది, ఐపీల్ ఆడటానికి యూసుఫ్ పఠాన్కి వెసులుబాటు వచ్చినట్టు అయింది