అడిలైడ్ టెస్టులో పూజారా సెంచరీ, టెస్టుల్లో 5వేల పరుగులు

Posted on : 06/12/2018 01:12:00 pm


అడిలైడ్ వేదికగా మొదలైన తొలి టెస్టులో పూజారా సెంచరీ కొట్టేశాడు. తన అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్లో 16వ సెంచరీని బాదేశాడు. వరుసగా టాపార్డర్ వికెట్లు పడిపోతున్న తరుణంలో తానొక్కడూ నిలబడి స్కోరును నడిపించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఛతేశ్వర్‌ పుజారా కూడా కీలక మైలురాయి కోసం ఎదురు చూస్తున్నాడు. మరో 95 పరుగులు చేస్తే టెస్టుల్లో అతడి ఖాతాలో 5,000 పరుగులు చేరతాయి.

టీమిండియా టెస్టు కెరీర్లో ద్రవిడ్‌తో పాటుగా 5వేల పరుగుల మైలు రాయిని దాటింది పూజారా ఒక్కడే. ఈ క్రమంలో 3000పరుగుల మైలురాయిని దాటేందుకు 67ఇన్నింగ్స్ తీసుకున్నాడు. 84 ఇన్నింగ్స్‌లో 4000పరుగులు పూర్తి చేయగలిగాడు. ఇక ప్రస్తుతం ఆడుతోన్న 108వ ఇన్నింగ్స్‌లో 5వేల పరుగులు చేరుకున్నాడు.

అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఆడకముందు 5వేల పరుగుల మైలురాయిని దాటేందుకు 95పరుగులు కావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌తో ఆ రికార్డును కొల్లగొట్టడమే కాకుండా కెరీర్లో 16వ టెస్టు సెంచరీని కూడా బాదేశాడు.