మళియాళ లేడీ సూపర్ స్టార్ మంజూ వారియర్ కి గాయాలు!

Posted on : 06/12/2018 01:54:00 pm


మాలీవుడ్ బ్యూటీ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మంజూ వారియర్ కి షూటింగ్ లో గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాక్ అండ్ జిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాలిదాస్ జయరామ్ హీరోగా నటిస్తున్నాడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఓ యాక్షన్ సీన్స్ తెరకెక్కింస్తుండగా మంజూ వారియర్ గాయపడింది.

వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్ ఆమెను దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే మంజు వారియర్ కి తలకు బలమైన గాయం కావడంతో ఆమెకు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుందని చిత్ర బృందం తెలిపింది.

మోహన్ లాన్ హీరోగా వస్తున్న 'ఓడియన్' చిత్రంలో కీలక పాత్ర పోషించింది మంజూ వారియర్. ఈ చిత్రం డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాదు ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుందట. మరో చిత్రం లూసిఫర్‌లోను మంజూ వారియర్ , మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రానుంది.