మహేష్ బాబు అడ్డాలో వరుణ్ తేజ్ సినిమా.. క్రేజీ డెసిషన్!

Posted on : 06/12/2018 02:27:00 pm


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న అంతరిక్షం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్2 చిత్రం సంక్రాంతికి సందడి చేయబోతోంది. అంతరిక్షం త్వరలో విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ నిన్ననే ప్రకటించింది. ట్రైలర్ లాంచ్ గురించి ఆకస్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. 

ఘాజి చిత్రంతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన సత్తా నిరూపించుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా ప్రయోగాత్మక కథలు ఎంచుకుంటున్నాడు. ఘాజి చిత్రం అందరిని ఆకట్టుకుంది. ఈ సారి అంతరిక్ష పరిశోధన అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అంతరిక్షం చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. 

స్పేస్ లో వరుణ్ తేజ్ చేసే విన్యాసాలని చూడడానికి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీజర్ ఆ ఉత్కంఠని మరింతగా పెంచింది. డిసెంబర్ 9న థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని విభిన్నంగా నిర్వహించబోతున్నలు వార్తలు వస్తున్నాయి. 

ఈ స్పేస్ థ్రిల్లర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్, అదితిరావు హైదరి వ్యోమగాములుగా కనిపిస్తారు. డిసెంబర్ 21 న చిత్రం విడుదల కానుంది. వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అంతరిక్షం చిత్రంతో ఈ మెగా హీరో హ్యాట్రిక్ పై కన్నేశాడు.