యోగిపై సిద్దూ అవాకులు, చెవాకులు

Posted on : 06/12/2018 02:31:00 pm


పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూపై హిందూ యువవాహిన సంచలన ఆరోపణలు చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై సిద్దూ అవాకులు, చెవాకులు పేలారని... ఆయన తలను నరికి తీసుకొచ్చిన వారికి కోటి రూపాయలను నజరానాగా ఇస్తామని తెలిపింది. హిందూ యువవాహిని ఆగ్రా విభాగం అధ్యక్షుడు తరుణ్ సింగ్ మాట్లాడుతూ, సిద్దూ ఆగ్రాకు వస్తే తల నరికేస్తామని హెచ్చరించారు. పాకిస్థాన్ కు అనుకూలంగా సిద్దూ ప్రతిసారి మాట్లాడుతున్నారని... ఆయనకు భారత్ లో ఉండే అర్హత కూడా లేదని అన్నారు. సిద్దూను తామే పాకిస్థాన్ కు పంపించేస్తామని చెప్పారు.

ఆదివారం రాజస్థాన్ లో జరిగిన ఓ ర్యాలీలో సిద్దూ ప్రసంగిస్తూ, మోదీ ఒక దొంగ అని, యోగి ఒక భోగి అని అన్నారు. బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. చౌకీదారు కుక్క కూడా విశ్వాసాన్ని కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే, సిద్దూకు వ్యతిరేకంగా హిందూ యువవాహిని ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలను చేపడుతున్నారు.