కూకట్ పల్లి లో ఓటుకునోటు ఎంతో తెలుసా ... నోరెళ్ళ బెట్టాల్సిందే...!

Posted on : 06/12/2018 05:50:00 pm


తెలంగాణ లో అన్ని నియోజక వర్గాల కంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు కాస్ట్ లీ నియోజక వర్గం ఏదైనా ఉందంటే అదే కూకట్ పల్లి మాత్రమే. అయితే ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. ఈ దఫా తెలంగాణ ఎన్నికల్లో అత్యంత కాస్ట్లీ నియోజకవర్గంగా కూకట్ పల్లి నిలుస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి విజయం అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక్కడ సుహాసిని ఓడిపోతే తెలుగుదేశం పార్టీ పరువు పోవడం అంటే అది మామూలు అవమానం కాదు. అందుకే.. ఇక్కడ తెలుగుదేశం సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నాలు సాగిస్తోంది.

ఇప్పటికే ఎక్కడెక్కడి తెలుగుదేశం అనుకూల సామాజికవర్గం నేతలూ కూకట్ పల్లిలో దిగిపోయారు. ఇలాంటి నేపథ్యంలో... నేతలు బస చేసిన చోట కూడా భారీగా సొమ్ములు దొరుకుతున్నాయి. ఇప్పటికే పంపకాలు కూడా జరిగినట్టుగా సమాచారం. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తెలుగుదేశం పార్టీ ఓటుకు ఐదు వేల రూపాయల వరకూ ఇస్తోంది.

ఈ మేరకు డబ్బులు పొందిన వాళ్లు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. కూకట్ పల్లి పరిధిలో ఆరుగురు కుటుంబ సభ్యులున్న ఒక కుటుంబం ఏకంగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని తీసుకున్నట్టుగా వివరించింది. ఇక తెరాస కూడా తనవంతు ప్రయత్నాలు సాగిస్తోందని సమాచారం. అయితే ఓటుకు నోటు విషయంలో తెలుగుదేశం అభ్యర్థితో తెరాస అభ్యర్థి అక్కడ ఢీ కొట్టలేకపోతున్నాడని కూడా స్థానికుల నుంచి సమాచారం అందుతోంది.