పుణె నుంచి లోక్‌సభ బరిలో మాధురీ దీక్షిత్!

Posted on : 06/12/2018 07:01:00 pm


2019లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్లను రంగంలోకి దించనుంది. పూణె లోక్ సభ స్థానం నుంచి మాధురీ దీక్షిత్ ను బరిలోకి దింపనున్నట్టు పార్టీ శ్రేణులు తెలిపాయి. జూన్ నెలలో ముంబైలోని మాధురీ నివాసానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ఆమెకు వివరించారు.

తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ సీనియర్ నేత పీటీఐతో మాట్లాడుతూ, పూణె స్థానానికి సంబంధించి మాధురీ దీక్షిత్ పేరును ఖరారు చేసినట్టు తెలిపారు. ఆమెకు పూణె నియోజకవర్గం సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ఎన్నికల్లో కొత్తవారిని బరిలోకి దింపడం వల్ల ఉపయోగం ఉంటుందని... వారిని విమర్శించడానికి విపక్షాలకు ఎలాంటి ఆయుధాలు దొరకవని తెలిపారు.