అజ్ఞ్యాతవాసి రివ్యూ

Posted on : 10/01/2018 04:44:00 pm

నటీనటులు : పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్

దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత : ఎస్. రాధాకృష్ణ

సంగీతం : అనిరుద్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : వి. మణికందన్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

రేటింగ్: 2/5

 AB అనే ఒక MNC కంపెనీకి గోవింద భార్గవ్ (బోమన్ ఇరానీ) CEO, అతనితో పాటు అతని స్నేహితులు రావు రమేష్, మురళీశర్మ etc ఉంటారు. గోవింద భార్గవ్ (బోమన్ ఇరానీ), అతని కుమారుడు ఆ కంపెనీ యొక్క టేకోవర్ కుట్ర లో భాగంగా హత్య చేయబడతారు. కానీ వాళ్లకి తెలియదు, ఒక వారసుడు ఉన్నాడని.

 సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్. ఆయన కనిపించే సన్నివేశాలు చాలా వరకు అభిమానుల్ని అలరిస్తాయి. ఫుల్ ఎనర్జీతో, తన ట్రేడ్ మార్క్ మ్యానరిజంతో పవర్ స్టార్ సినిమాను నెట్టుకురావడానికి చాలానే ప్రయత్నించాడు. ఇక హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్, పవన్ కళ్యాణ్ ల మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. సినిమా ఆరంభం నార్మల్ గానే ఉన్న ఇంటర్వెల్ సమయంలో రివీల్ అయ్యే ట్విస్ట్ కొద్దిగా ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది.

 ఆరంభం నుండి చివరి వరకు హీరోతో పాటే ఉండే శర్మ (మురళీ శర్మ), వర్మ (రావు రమేష్) లా పాత్రల పై నడిచే కామెడీ చాలా చోట్ల సఫలమై బోర్ కొట్టించే కథనం నుండి కొంతలో కొంత రిలీఫ్ కలిగించింది. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర యొక్క డైలాగులు త్రివిక్రమ్ స్టైల్లో ఉండి అలరించాయి. అలాగే సెకండాఫ్లో వచ్చే కొడకా కోటేశ్వర్ రావ్ పాటలో మాత్రమే పవన్ కొద్దిగా మాస్ స్టెప్పులు వేయడంతో హుషారు కలిగింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు, ఫైట్స్ పర్వాలేదనిపించాయి.

 ఇక కుష్బు, పవన్ ల మధ్య ఉండే తల్లి, కొడుకుల రిలేషన్ ను ఎలివేట్ చేసే సన్నివేశాలు, వాటిలో ఇద్దరి నటన మెప్పించాయి. చిత్ర నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

 సినిమా మొత్తంలో త్రివిక్రమ్ మార్క్ అనేదే కనబడకపోవడం పెద్ద బలహీనత. చూస్తున్నంతసేపు అసలిది త్రివిక్రమ్ సినిమానేనా అనిపిస్తుంది. ఎంత పాత కథనైనా ఆసక్తికరమైన కథనం, బలమైన పాత్రలు, పదునైన మాటలతో రక్తికట్టించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా తయారుచేయగల త్రివిక్రమ్ ఈ సినిమాలో పూర్తిగా అలసత్వాన్ని ప్రదర్శించారు. ముఖ్యమైన హీరో పాత్ర దగ్గర్నుంచి కీలకమనిపించే అన్ని పాత్రల్ని ఊహించలేనంత తక్కువ స్థాయిలో రాసి ఎక్కువ భాగం సినిమాను బోర్ కొట్టించేశాడు. ఈ బలహీనత ముందు పవన్ ఛరీష్మా కూడా సినిమాను కాపాడలేకపోయింది.

 ఇక తన ప్రతి కథలో కూడా హీరోయిన్లకు ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదించి ఆసక్తికరంగా చూపించే త్రివిక్రమ్ ఇందులో మటుకు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరికీ కథలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా కథనంలో, కామెడీలో బలవంతంగా ఇరికిస్తూ చిరాకు తెప్పించారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ వంటి స్టార్ కమెడియన్లు ఉన్నా కూడా వారిని సరిగా వాడకపోవడంతో ఎంటర్టైన్మెంట్ పెద్దగా పండలేదు.

 ఇక కథకు కీలకమైన ప్రతినాయకుడి పాత్ర కూడా బలహీనంగా ఉండటంతో కథనంలో బలం లోపించడమేగాక పవన్ పాత్ర అనవసరమైన హాస్యానికి తప్ప అసలు సరైన లక్ష్యమనేదే లేక తేలిపోయింది. దీంతో అభిమానులు సైతం చాలా చోట్ల నీరసానికి, అసహనానికి లోనవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. వీటన్నింటికీ తోడు హీరో విలన్ ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఎక్కడా ఎగ్జైట్మెంట్, సీరియస్నెస్ లేకపోవడంతో సినిమా మొత్తం చప్పగా తయారైంది.

 జీవితంలో మ‌నం కోరుకునే ప్ర‌తీ సౌక‌ర్యం వెన‌క మినీ యుద్ధ‌మే దాగుంటుంది క‌దా. ఇది త్రివిక్ర‌మ్ రాసిన డైలాగే. ఇప్పుడు సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు కూడా ఇదే అనుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా తొలిరోజు తొలి షో చూడాల‌నుకోవ‌డం చాలా మంది అభిమానుల‌కు సౌక‌ర్యం.. కానీ సినిమా మొద‌లైన కాసేప‌టికే అది ఎప్పుడు పూర్త‌వుతుందా అనే మినీయుద్ధం కూడా జ‌రుగుతుందేమో..? ఎక్క‌డైనా త్రివిక్ర‌మ్ మ్యాజిక్ సినిమాలో క‌నిపిస్తుందా అని చాలా మంది ఫ్యాన్స్ వేచి చూసారు కానీ అది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు ఈ చిత్రంలో. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మేమున్నాం అంటూ గుర్తు చేయ‌డానికి హీరోయిన్లు వ‌స్తుంటారు కానీ వాళ్ళ‌తో పెద్ద‌గా అవ‌స‌రం లేద‌నిపించింది. త్రివిక్ర‌మ్ సినిమాల్లో హీరోయిన్లు ఇంత‌గా తేలిపోయిన సినిమా అయితే ఇదే. ఫ‌స్టాఫ్ లో భ‌లే ఉందిరా అనే సీన్ ఒక్క‌టీ లేదు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కూడా సోసోగానే డిజైన్ చేసాడు ద‌ర్శ‌కుడు. పోనీలే సెకండాఫ్ కుమ్మేస్తాడేమో అనుకుంటే.. డైలాగ్స్ తో క‌ట్టి ప‌డేస్తాడేమో అని ఆశ‌ప‌డితే అప్పుడు కూడా నిరాశే. అత్తారింటికి దారేది త‌ర‌హాలో ఎమోష‌న్స్ తో మ‌న‌సును త‌డిపేస్తాడేమో అనుకున్న అభిమానుల‌ను స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టే సీన్స్ రాసుకున్నాడు మాట‌ల మాంత్రికుడు. ముఖ్యంగా ఆఫీస్ లో వ‌చ్చే సైకిల్ సీన్ అయితే నిజంగానే ప్రేక్ష‌కుల‌కు ప‌రీక్షే. కొడ‌కా కోటేశ్వ‌ర‌రావ్ పాట ఒక్క‌టే ప‌వ‌న్ ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చేది. సైకిల్ ఎక్కి అంద‌ర్నీ కొడుతూ రౌడీ అల్లుడు సీన్ గుర్తు చేసాడు త్రివిక్ర‌మ్. కానీ చిరంజీవిని చూసి న‌వ్వుకున్న వాళ్ల‌కు ప‌వ‌న్ మాత్రం ఏడిపించాడు. అన‌వ‌స‌రంగా పాట‌లు మ‌ధ్య‌లో వ‌స్తుంటే.. అర్థం ప‌ర్థం లేని సీన్స్ డిస్ట‌ర్బ్ చేస్తుంటే.. క‌థ‌లో నేను ఉన్నానంటూ అప్పుడప్పుడూ విల‌న్ గుర్తు చేస్తుంటే..నిజంగా క‌థ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందేమో అని చాలామందికి అనిపిస్తుంది. పాటల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఏ ఒక్క పాటకి కూడా సన్నివేశం కుదరలేదు, ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే, అలంటి హిట్స్ ని మామూలుగానే ఎక్సపెక్టషన్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఏ మాత్రం ఆకట్టుకోవు. నిజం చప్పలంటే పాటలు వచ్చినప్పుడు కళ్ళుమూసుకొని పాట వినటం మంచిది, వీడియో చూస్తే బయటకి వచ్చాక మాలి ఆడియో వినాలనిపించదు. నేపధ్య సంగీతం కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు అసలు అనిరుద్ యేన సంగీతం అనిపిస్తుంది. 

 మణికంఠ ఫోటోగ్రఫి గురించి మాట్లాడుకోవాలి, దర్శకత్వం ఫెయిల్, సంగీతం ఫెయిల్, కథ, కథనాలు కూడా ఫెయిల్ అలాంటి సమయంలో మణికంఠ ఫోటోగ్రఫి ప్రేక్షకుడి కాసింత ఊరట లభిస్తుంది అనే చెప్పాలి. ఒకానొక సమయం లో మనం చూస్తున్నది త్రివిక్రమ్ సినిమాయేనా అనిపిస్తుంది.

చివరగా అజ్ఞాతవాసి... రావు రమేష్ మాటల్లో థాట్స్ ఎన్ అగ్లీ.