ఈ ఏడాది ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ఐపీఎస్ లు

Posted on : 10/01/2018 10:48:00 pm

రాష్ర్ట ప్ర‌భుత్వం ఈ ఏడాది ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ఐపీఎస్ అధికారులు జాబితాను విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వులను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దినేష్ కుమార్ విడుద‌ల చేశారు. ఈ ఏడాది ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న వారిలో జ‌న‌వ‌రి 31న కె. కోటేశ్వ‌ర‌రావు, ఫిబ్ర‌వ‌రి 28న బి.వి ర‌మ‌ణ కుమార్, ఏప్రిల్ 30న షేక్ మ‌హ్మ‌ద్ ఇక్బాల్, జూన్ 30న డాక్ట‌ర్ ఎం. మాల‌కొండ‌య్య,  జూలై 31న ఎం. సుబ్బారావు, ఆగ‌స్టు 31న డాక్ట‌ర్ టి. యోగానంద్, సెప్టెంబ‌ర్ 30న ఎస్.వి ర‌మ‌ణ‌మూర్తి, న‌వంబ‌ర్ 30న జె. బ్ర‌హ్మారెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న‌ట్లు ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.