సిసి కెమెరాలను అప‌రేట్ చేస్తోందెవ‌రూ..?

Posted on : 10/01/2018 10:55:00 pm

దుర్గ‌గుడి నిఘా నేత్రాలు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చాయి. గ‌తంలో  ఇక్క‌డ ప‌ని చేసిన అధికారి ఇప్ప‌టికీ నిఘా నేత్రాల‌ను వీక్షిస్తున్నార‌నే అనే అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. సిసి కెమెరాల‌ను ఇంటి ద‌గ్గ‌ర స్ర్కీన్ ల‌పై చూసే అవ‌కాశం ఏర్ప‌ర‌చుకున్న అధికారి ఇప్ప‌టికీ అదే మాదిరిగానే చూస్తున్నారా అనే విషయాలు చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. దుర్గ‌గుడి నిఘా నేత్రాల కోడ్ ఎందుకు మార్చ‌డం లేద‌నే చ‌ర్చ సాగుతోంది. దుర్గ‌గుడిలో  నిఘా కెమెరాలు ఏవ‌రి అధీనంలో ఉన్నాయి ఎవ‌రెవ‌రు అప‌రేట్ చేస్తున్నారు. సంబంధిత నిఘా కెమెరాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న అధికారి ఎవ‌ర‌నే అంశం ఇప్పుడు తెర‌మీదకు వ‌స్తోంది. ఇప్ప‌టికైనా నిఘా నేత్రాల కోడ్ ను త‌క్ష‌ణ‌మే మార్చ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌నే ప‌లువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు.