13న ఏపీ కేబినెట్ భేటీ, 17 సీఎం దిల్లీకి

Posted on : 10/01/2018 11:03:00 pm

ఈ నెల 13న రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తొలుత 17న కేబినెట్ భేటీ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అయ‌తే అదే రోజు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ ముఖ్యమంత్రి క‌ల‌వాలంటూ ఆహ్వానించారు. ఆ ఫ‌లితంగానే ముంద‌స్తుగా మంత్రి వ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. త‌న దిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రాష్ర్టంలో  త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకు ప్ర‌ధానిని ఆహ్వానించే యోచ‌న‌లో ముఖ్యమంత్రి ఉన్న‌ట్టు స‌మాచారం.
క‌లెక్ట‌ర్ల వేదిక స‌ద‌స్సు వేదిక మార్పు
కాగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఈ నె 18, 19వ తేదీల‌లో  రెండు రోజుల పాటు క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. అయితే మారిన షెడ్యూల్ ప్ర‌కారం వెల‌గ‌పూడి స‌చివాల‌యంకు బ‌దులుగా ఉండ‌వ‌ల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వ‌ద్ద ఉన్న గ్రీవెన్స్ భ‌వ‌నంలో స‌ద‌స్సును నిర్వ‌హించాల‌ని తాజాగా నిర్ణ‌యించారు. ఇందుకోసం శ‌ర‌వేగంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. స‌చివాల‌యంలో 5వ బ్లాక్ లో నిర్మిస్తున్న కాన్ఫ‌రెన్స్ హాల్ నిర్మాణం ఇంకా పూర్తి కాక‌పోవ‌డంతో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు స్థ‌లాన్ని మార్చారు.