ఊపందుకున్న నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్ విభ‌జ‌న

Posted on : 10/01/2018 11:34:00 pm

ఉభ‌య తెలుగు రాష్ర్టాల్లో కొత్త నియోజ‌క‌వ‌ర్గాల ఏర్పాటు అంశం మ‌ళ్లీ ఊపందుకున్న‌ది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి 15న నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్ విభ‌జ‌న‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున‌ట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు సూచ‌న‌లు కేంద్రం నుంచి రాష్ర్ట ప్ర‌భుత్వానికి అందాయి. నియోజ‌క‌వర్గాల పున‌ర్ విభ‌జ‌న‌కు సంబంధించి  ఇప్ప‌టికే కేంద్ర హోమంత్రిత్వ శాఖ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ కూడా రూపొందించి, సిద్ధం చేసిన‌ట్లు రాష్ర్ట ప్ర‌భుత్వానికి స‌మాచారం అంద‌డంతో అప్ర‌మ‌త్త‌మైంది. తెలుగు రాష్ర్టాల్లోని అసెంబ్లీ సెగెంట్ల డీమిలిటేష‌న్స్ పై ఇప్ప‌టికే ప్రాధ‌మికంగా అధ్య‌య‌నం చేశారు. స‌చివాల‌య సీనియ‌ర్ అధికారి ఒక‌రు ఈ అంశాన్ని కీల‌కంగా ప‌రిశీలిస్తున్నారు. కొత్తగా ఎస్ సీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల  ఏర్పాటుతో పాటు గ‌రిష్టంగా 2225 అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాల‌కు  లోబ‌డి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు  స‌మాచారం. రెండు ల‌క్ష‌ల జ‌నాభాను ప్రామాణికంగా తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కొండ‌లు, న‌దులను కార‌ణంగా చూపి, ఏదైనా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని విభ‌జించ‌రాదంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న‌కు సంబంధించి అధ్య‌య‌నం చేసి, విచారించి, నివేదిక రూపొందించేందుకు కేంద్ర మాజీ సుప్రీం కోర్టు ఏర్పాటు చేశార‌. ఈ క‌మిటీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విస్తృతంగా ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకుని, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న కోసం ఈ క‌మిటీ అవ‌స‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించి కేంద్రానికి నివేదిస్తుంది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల త‌యారీ ప్ర‌క్రియ ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ లోపు పూర్త‌వుతుందంటున్నారు. విశ్వ‌స‌నీయ సమాచారం ప్ర‌కారం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొత్తగా మూడు నుంచి  నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్పాట‌య్యే అవ‌కాశం ఉందంటున్నారు. అదే విధంగా గుంటూరులో రెండు, విజ‌య‌వాడ న‌గ‌రంలో రెండు కంటే ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాను ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. అయితే కొత్త నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌క‌టించే ముందు క‌మిటీ రాష్ర్ట వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకుటుంది. ఇప్ప‌టికే ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో కొత్త నియోజ‌క‌వ‌ర్గాల అవ‌స‌రాన్ని క‌మిటీ ముందు ఉంచేందుకు అన్ని రాజ‌కీ పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా ఈ విష‌య‌మై ఫిబ్ర‌వ‌రి 2 నుంచి  కేడ‌ర్ తో ప‌ర‌స్ప‌ర చ‌ర్చించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కొత్త నియోజ‌క‌వ‌ర్గా ఏర్పాటుపై క‌మిటీకి వివ‌రించాల‌ని టీడీపీ పార్టీ శ్రేణుల స‌ర్వం సిద్ధ‌మ‌వుతున్నాయి.