ఎందుకంటే, " />
 ఎందుకంటే, " />

మొలత్రాడా?!? బిగుత్రాడా?!?!

Posted on : 11/01/2018 04:42:00 pm

" చేత వెన్న ముద్ద చెంగళ్వ పూదండ బంగారు "మొలత్రాడు" పట్టు దట్టి... " అని చిన్ని కృష్ణుని వర్ణిస్తాం...

 ఎందుకంటే, అప్పటి కన్నయ్యకి ఎలాస్టిక్ నిక్కర్లు, తోలు బెల్ట్ లేవు... గోచి ఊడకుండా ఉండటానికి మొలత్రాడు కట్టే వారు...స్టేటస్ ని బట్టి దారం, వెండి, బంగారు మొలత్రాడులు నడుముకు చుట్టేవారు..!!!

మొలత్రాడు అలంకారము కాదు, మత చిహ్నము కాదు...హిందువులే ఎందుకు కడతారంటే అప్పట్లో హిందువుల వస్త్ర ధారణ ఏంటో తెలుసుగా మరి..!! పంచె ఊడకుండా పట్టు కోసం..!!! ఎలాగో ఊతగా ఉందికదా అని తాళాల గుత్తులు, తాయత్తులు, పిన్నీసులు వ్రేలాడేవి అదనంగా..!!!

 అవసరాలు ఆచారాలుగా మారటం మన దేశంలో క్రొత్త కాదుగా...అలా పుట్టుకొచ్చి, చుట్టుకొస్తున్నదే మొలత్రాడు..!!

అబ్బా మెడ బోసిపోయిందే అని ఆడపిల్లని, నడుం బోసిపోయిందే అని మగపిల్లాడిని అని అమ్మమ్మలు నాయనమ్మలు దెప్పిపొడుస్తూ బోసినవ్వుల బుజ్జాయిలకు కాస్త బరువు తగిలిస్తారు...!! లేకపోతే పరువు పోదా మరి ?!?!

బోసి నవ్వులు కనిపించవు, బోసి మెడలు, బోసి నడుములు కన్పిస్తాయి వీళ్ళకి....!!!

అలంకారమైనా, ఆచారమైనా అంగీకారంతోనే అందంగా ఉంటాయి..!! అనాదిగా వస్తుంది కదా అని అయిష్టంగా అయినా సరే అనుసరించాలి అంటే ఎలా ?!??

మొలత్రాడు లో కూడా సైన్స్ లెక్కలు చెప్తారండి..!! వరల్డ్ హెల్త్ ఆర్గనైసెషన్ వాళ్ళక్కూడా అంతుచిక్కని చిక్కటి చక్కటి సైన్స్..!!!

మొలత్రాడు పాజిటివ్ ఐతే diseases నెగిటివ్, మొలత్రాడు నెగిటివ్ ఐతే diseases పాజిటివ్ అనే దిక్కుమాలిన లెక్కలున్నాయా ఎక్కడైనా?!?!! కొందరి పిల్లలకి నడుము చుట్టూ rashes కూడా వస్తుంటాయి పాపం..!! అప్పుడు చెప్పరు వీళ్ళు సైన్స్ పాఠాలు..!!!

ఇదంతా తమ చాదస్తాన్ని అనవసరంగా బలవంతంగా చంటి పిల్లల నడుం చుట్టూ చుట్టే పెద్దవాళ్ళకోసం మొలత్రాడు బాధితులు చేసే విన్నపం.... అవసరమనుకుంటే నేను అనుసరిస్తాను...ఆచారమని చెప్పి అర్థం లేని మాటలు చెప్తే ప్రశ్నిస్తాను..!! పిల్లల్ని ముద్దు చేసి పెంచాలి..మూఢత్వపు ఆచారాలతో కాదు..!!!!

- రఘునాథ్ బాబు