ఇదేనా త్రివిక్రమ్ చేసిన తప్పు ?

Posted on : 12/01/2018 01:42:00 am

              ఒక సినిమా హిట్ అయితే అది ఆ సినిమా హీరో గొప్పతనం, ఒక సినిమా ప్లాప్ అయితే అది దర్శకుడి చేతకానితనం. సినిమా హిట్ అయితే హీరోకి పాలాభిషేకాలు, సినిమా ప్లాప్ అయితే దర్శకుడి దిష్టిబొమ్మల దహనాలు, సినిమా వసూళ్లు సాధిస్తే అది హీరో బాక్స్ ఆఫీస్ స్టామినా, అదే సినిమా వసూళ్లు లేకపోతే దర్శకుడి వైఫల్యం, విజయం సాధిస్తే ఆకాశానికి ఎత్తేయడం లేకపోతే అదః పాతాళానికి నెట్టేయడం ఇది మన తెలుగు సినిమాకి పట్టిన దరిద్రం.
            పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్లాప్స్ లో ఉన్న టైంలో జల్సాతో చక్కని హిట్ ఇచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది లాంటి ఫామిలీ ఎంటర్టైనర్ తో అతనికి మొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి అగ్రస్థానానికి దెగ్గరగా చేసారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి ఓవర్సీస్ లో 1 మిలియన్ కలెక్షన్ ఉన్న సినిమా ఒక్కటి లేదు, కానీ అత్తారింటికి దారేది సినిమాతో ఆ లోటుని కూడా తీర్చేసాడు. సినిమా ఫెయిల్ అయినా త్రివిక్రమ్ ఎప్పుడు తన దర్శకత్వంలో ఫెయిల్ అవలేదు. సమంత లీడ్ రోల్లో వచ్చిన అ..ఆ.. తో కూడా హిట్ కొట్టి 50 కోట్ల షేర్ మరియు ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాల్లర్స్ వాసులు అయ్యాయి అంటే దాన్లో త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభ తప్ప ఇంకా ఏమి లేదు అనే చెప్పాలి.  అలాంటి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అగ్న్యాతవాసి చిత్రం మొదటి రోజునుంచే నెగటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో చిత్రం పూర్తిగా విఫలం అయింది, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవడంతో అందరు త్రివిక్రమ్ ని తిట్టడం ప్రారంభించారు. దర్శకత్వంలో ఓనమాలు తెలియని వారు కూడా త్రివిక్రమ్ దర్శకుడుగా పనికి రాడు అని విమర్శించడం ప్రారంభించారు.
              ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలి అంటే అది చాల కష్టంతో కూడిన విషయం, ఎందుకంటే దర్శకుడికి తాను అనుకున్నట్టుగా సినిమా తీసే అవకాశం ఉండదు, సినిమా తేసేపుడు ఆ స్టార్ హీరో స్టార్డామ్ దృష్టిలో ఉంచుకొని, అంతే కాకుండా వారి అభిమానులకు నచ్చేవిధంగా తీసేప్పుడు దర్శకుడు తాను అనుకున్న కథలో, కథనంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది, ఇప్పుడు అగ్న్యాతవాసి చిత్రంకి కూడా అలానే జరిగింది. త్రివిక్రమ్ తాను అనుకున్నది అనుకున్నట్లు తీయలేపోయానని తన సన్నిహితుల వద్ద అన్నట్టు సమాచారం. అంతే కాకుండా స్టార్ హీరో దర్శకత్వ విభాగంలో చేయి పెట్టాడు అని, తన స్నేహితుడు కావడంతో త్రివిక్రమ్ ఏమి చేయలేక మిన్నకుండి పోయాడు అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇది ఏమి అయినా ఒక చిత్రం ఫెయిల్ అయింది అంటే ఒక్క దర్శకుని తప్పు మాత్రమే కాదు అని ప్రేక్షకులు గ్రహించాలి