సమీక్ష :జై సింహ

Posted on : 12/01/2018 04:02:00 pm

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి,,ప్రకాష్ రాజ్, మురళీ మోహన్, అశుతోష్ రాణా, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివాజీ రాజా తదితరులు
సంగీతం: చిరంతన్ భట్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
నిర్మాత: సి.కళ్యాణ్
కథ - మాటలు: ఎం.రత్నం
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
రేటింగ్: 2.5/5

 టాలీవుడ్ సంక్రాంతి సీసన్ ని ఎవరు మిస్ అయినా బాలయ్య బాబు మాత్రం మిస్ అవ్వటం లేదు, గత సంక్రాంతికి గౌతమీ పుత్ర శతకర్ణితో, అంతకు ముందు Dictatorతో వచ్చిన బాలయ్య ఈసారి తనకు అచొచ్చిన సింహ టైటిల్ లో ఉండేలా తీసిన జై సింహాతో వచ్చాడు. గత చిత్రం పైసా వసూలుతో నిరాశ పరిచిన బాలయ్య, కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు కే యస్ రవికుమార్ ఇద్దరికి ఈ చిత్రం అత్యంత కీలకం. బాలయ్య బాబుకు అచ్చోచిన హీరోయిన్, సీసన్, టైటిల్ అన్ని ఉండటం వల్లకూడానూ ఈ చిత్రం పై అంచనాలు భారీగానే పెట్టుకున్నారు ప్రేక్షకులు అభిమానులు. చూదాం ఈ చిత్రం ఎంతవకు ప్రేక్షకులను అలరించిందో....

 ఈ చిత్రం టీజర్ కానీ ట్రైలర్ కానీ ఎక్కడ ఈ చిత్రంలో ఎక్కడ కొత్తదనం లేదని, అలాంటి వాటి గురించి ఆలోచించొద్దని ముందే చెప్పాయి, ట్రైలర్లో చూపించినట్టే సినిమా కూడా ea కొత్తదనం లేకుండా, ఒక ఫార్ములా ప్రకారం సాగిపోతుంది.

 ఒక హీరో(నరసింహ) తన బిడ్డ తో సాదాసీదా జీవితం గడుపుదామని తన ఐడెంటిటీని దాచిపెట్టి కుంభకోణం అనే ప్రాంతంలో ఒక దేవాలయం ధర్మకర్త (మురళి మోహన్) దగ్గర పనిలో చేరతాడు. ఆ ప్రాంతం లో ఒక విలన్(బాహుబలి ప్రభాకర్/కాలకేయ )కి ధర్మకర్త కూతురు ను ప్రమాదం నుండి తప్పించటానికి తప్పును నరసింహం తనమీద వేసుకొని శత్రువు అవుతాడు. ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఎసిపి ఆలయంలో బ్రాహ్మణుడిని కొట్టాడని అతనికి కూడా శత్రువు అవుతాడు నరసింహం. ఆ తరువాత ఎసిపి కుటుంబాన్నే కాపాడాల్సి  వస్తుంది. ఎందుకు కాపాడాలి అనేది కథ. ఒక పెద్ద ఫైట్ చేసి కాపాడతాడు కూడా ఇది ఇంటర్వెల్ ఎక్కడ ఒక ట్విస్ట్. ప్రథమార్ధం అంత కూడాను హీరో సైలెంట్ గ ఉంటూ అక్కడ అక్కడ పంచులు వేస్తూ తనకి ఏదో గొప్ప గతం ఉంది అనేటట్టుగా ఉంటుంది. ప్రధమార్ధంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి బ్రాహ్మణుల కోసం చెప్పే డైలాగ్స్, అమ్మ కుట్టి సాంగ్ ఇవి మాస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుటాయి వీటితో పాటు అక్కడక్క మాస్ కి నచ్చే అంశాలు ఉన్నాయ్.

 ప్రథమార్ధం వరకు కొత్తదనం లేకపోయినా ఎక్కడ కూడా ప్రేక్షకుడికి చిరాకు తెప్పించే సన్నివేశాలు లేకపోవటం కలిసొచ్చే అంశం. ద్వితీయార్ధం మొదలవగానే కథ గతంలోకి (3 సంవత్సరాలు వెనక్కి ) వెళుతుంది.

 మూడు సంవత్సరాల క్రితం విశాఖపట్టణం అక్కడ అన్యాయాన్ని సహించని ఒక మెకానిక్ అతనికి ఒక బ్యాచ్, అలాగే తనతో చిన్నప్పటినుండి ఉన్న స్నేహం ప్రేమగా మారిన ప్రియురాలు. హీరో అన్యాయాల్ని సాహించడు కాబట్టి లోకల్ రాజకీనా నాయకుడి కొడుకు ఎంపీ టికెట్ కోసం రోడ్ మీద ధర్నా నిర్వహిస్తాడు దానివల్ల ఒక తల్లి బిడ్డ ట్రాఫిక్ లో అంబులెన్సు లోనే మరణిస్తారు, ఇది చూసి కూరుకొని హీరో విలన్ ని నామినేషన్ వెయ్యకుండా అడ్డుకుంటాడు, ఈ అవమానం భరించలేక అతడు ఆత్మ హత్య చేసుకుంటాడు, తన కొడుకుని చావుకు కారణమైన నరసింహాం ని చంపటానికి విలన్ కంకణం కట్టుకుంటాడు.

 ఒక వైపు విలన్ పగ మరోవైపు హీరోయిన్ ప్రేమ, వీటితో పాటు అక్కడక్క కొంచెం హాస్యం ప్రయత్నించారు కానీ అది కూడా పండలేదు, ద్వితీయార్ధం కొంచెం సాగతీతగాను ఉండటం ప్రేక్షకుడికి ఎప్పుడు అయిపోతుందా ఈ గతం అనిపించేలా ఉంటుంది. సుదీర్ఘమైన గతం తరువాత చిత్రం క్లైమాక్స్ కి వెళుతుంది అక్కడ కూడా రేగులర్గా జరిగే ఒక భారీ ఫైట్ హీరో అందరికి కాపాడటం విలన్స్ ని చంపడం. క్లైమాక్స్ లో హీరో బాలయ్య తాను ప్రేమించిన హీరోయిన్ కోసం త్యాగయ్య ల మారిపోతాడు.

 ప్రేమించిన అమ్మాయి(నయనతార)ని తాను బాగుండాలిని వేరే అమ్మాయిని(హరిప్రియ) పెళ్లిచేసుకుంటాడు, తన ప్రేయసికి ఇక పిల్లలు పుట్టారు అని గర్భసంచి తీసేశారని తెలిసి తనకు పుట్టిన కావలల్లో ఒకరిని ఇచ్చేస్తాడు, క్లైమాక్స్ ఫైటులో హీరోయిన్(నయనతార) తన బిడ్డని పోగొట్టుకుంటుంది, మల్లి తనpreyasi ఎక్కడ బాధపడుతుందో అని హీరో తన దగ్గర ఉన్న రెండో బిడ్డని కూడా త్యాగం చేసి బాలయ్య త్యాగయ్యగా మారాడు.

 అదే పాత కథ కథనాలు, ఆకట్టుకొని హాస్యం, చంద్రముఖీలో వడివేలు చేసిన comedy ye జై సింహ లో బ్రహ్మానందం చేస్తాడు ఆ స్కీన్లు చూస్తున్నంత సేపు ఏది చంద్రముఖి నా లేఖ జై సింహ న అనిపిస్తుంది. నేపధ్య సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోదు. పాటలు పరవాలేదు. అనగనగా, నీతోనే ఉంటా ఆకట్టుకుంటాయి, అమ్ముకుట్టి పాత మాస్ ని అలరిస్తుంది.

 మొత్తంగా ఏది కొన్ని మార్పులు చేర్పులు చేసిన నరసింహ నాయుడుగా అనిపిస్తుంది. అక్కడ ఫ్యాక్షనిస్ట్ ఇక్కడ మెకానిక్ అదొక్కటే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్, అలాగే కే యస్ రవికుమార్ తాను పాత తరానికి చెందిన దర్శకుడిని అని ప్రూవ్ చేసుకున్నారు.

బాటమ్ లైన్ : మెకానిక్..... నరసింహ నాయుడు.