సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల గొడవ ఏంటి ?

Posted on : 12/01/2018 10:03:00 pm

భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా మొట్ట మొదటి సారి గందరగోళం నెలకొంది, సుప్రీంకోర్టు ఐదు సీనియర్ న్యాయమూర్తులలో నలుగురు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాక్ మిశ్రాకు వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడారు. అలాగే ప్రధాన న్యాయమూర్తికి వారు రాసిన లేఖను విడుదల చేసారు. జస్టిస్ జస్తి చెలామేస్వర్, జస్టిస్ రంజన్ గోగోయి, జస్టిస్ మదన్ భీమరావు లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ మాట్లాడుతూ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ వ్యవస్థను కాపాడవలసిన అవసరం ఉందని, న్యాయవ్యవస్థ అంత సవ్యంగ లేదు అని అన్నారు. తాము తప్పని పరిస్థితుల్లో ఇలా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాల్సి వస్తుంది అని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాక్ మిశ్రా తమ సూచనలను పట్టించుకోట్లేదు అని అన్నారు, ఇది దేశ ప్రజలకు చేరాలి అని ఈ సమావేశం ఏర్పాటు చేశామని వారు వాపోయారు.
        ప్రజాస్వామ్యం రక్షించడానికి తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి అని న్యాయవ్యవస్థను కాపాడకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము అని వారు అన్నారు. తాము సమస్యల గురించి ప్రధాన న్యాయ మూర్తికి విన్నవించాం అని కానీ ఆయనని ఒప్పించడంలో విఫలం అయ్యాం అని అన్నారు. వారి ఆందోళనకి సంబందించిన పూర్తి వివరాలు వారు బయట పెట్టలేదు కానీ, నలుగురు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థలో ఒక అంశం గురించి ప్రధాన న్యాయమూర్తికి విన్నవించినట్టు తెలిసింది, ఆ అంశంకి సంబంధించి మార్గదర్శకాలు నిర్దేశించారని కానీ ప్రధాన న్యాయమూర్తి వాటిని పట్టించుకోనట్టుగా తెలిసింది.
          పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులూ, రాహుల్ గాంధీ ఈ విషయం మీద స్పందించారు. ప్రజాస్వామ్యానికి సంబందించిన అంశం కాబట్టి తాము న్యాయమూర్తులతో మాట్లాడతాం అని అవసరం అయితే ఈ అంశం మీద తాము పోరాడతాం అని అన్నారు. అలాగే జస్టిస్ లోధా హత్యకు సంబంధించి పూర్తి విచారణ జరగాలి అని, దేశ చరిత్రలో ఎలా ఎప్పుడు జరగలేదు అని అన్నారు. ప్రధాన మంత్రి మోడీ న్యాయమూర్తులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.