ఇకపై మీ పాస్ పోర్ట్ అడ్రస్ ప్రూఫ్ గా పనికిరాదు

Posted on : 12/01/2018 11:44:00 pm

          పాస్ పోర్ట్ చివరి పేజీని మనం సాధారణంగా చిరునామా గుర్తింపు (అడ్రస్ ప్రూఫ్ ) కి ఉపయోగిస్తుంటాం, కానీ ఇకపై అలా కుదరదు. భారత పాస్పోర్ట్ యొక్క చివరి పేజీని నిలిపివేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం నిర్ణయించింది. చివరి పేజీలో వుండే వివరాలు అయినా చిరునామా, తల్లి తండ్రుల వివరాలు, ఎమిగ్రేషన్ పరిశీలన అవసరం (ఇసిఆర్) మరియు పాత పాస్పోర్ట్ వివరాల ఇకపై ముద్రించడం లేదు అని తెలిపింది.
         విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారం ప్రతినిధి మాట్లాడుతూ, 3 సభ్యులతో కూడిన కమిటీ, మహిళా, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో జరిపిన చర్చల తర్వాత ఇకపై ఈ వివరాలు ముద్రించకూడదు అని నిర్ణయించినట్టు చెప్పారు, ఈ వివరాలు ఉంచడం వల్ల చాల సమస్యలు తలెత్తుతున్నాయి అని అన్నారు, ఈ విషయాన్నీ వివరిస్తూ చాల మంది నుంచి తల్లి/ తండ్రి వివరాలు పాస్పోర్ట్ లో వద్దు అని అభ్యర్థనలు వస్తున్నాయి అని, అలాగే తల్లి తండ్రులో ఒకరే ఉన్న వారికీ కూడా ఇది సమస్యగా మారింది అని అన్నారు, అంతే కాకుండా పిల్లలను దత్తత తీసుకున్న వారికీ కూడా ఇది సమస్యగా మారింది.
   పాస్పోర్ట్ చట్టం 1967 మరియు పాస్పోర్ట్ రూల్స్ 1980 లలో జారీ చేసిన పాస్పోర్ట్ మరియు ఇతర ప్రయాణ పత్రాల చివరి పేజీ ఇకపై ముద్రించబడదని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మెషీన్ రీడబుల్ ట్రావెల్ డాక్యుమెంట్స్కు సంబంధించి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) యొక్క మార్గదర్శకాలను పరిశీలించిన తర్వాత వివిధ భాగస్వాములతో సంప్రదించి కమిటీ యొక్క సిఫార్సును మంత్రిత్వ శాఖ పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంది.