ప్లాన్ బి తో వస్తున్న అగ్న్యాతవాసి

Posted on : 13/01/2018 12:20:00 am

           మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడింది, ఎంతో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అటు క్లాస్ కి, ఇటు మాస్ కి రీచ్ అవలేకపోవడంతో సినిమా కలెక్షన్స్ రెండవ రోజు నుంచే 80% దాక డ్రాప్ అయ్యాయి. ఈ చిత్రం ఇలాగే కొనసాగితే తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక నష్టాలు చవిచూసిన చిత్రం అయ్యే అవకాశం ఉంది. మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ రెండవరోజుకి టాక్ మారి ఫామిలీస్ కి రీచ్ అవుతుంది అని ఆశించారు కానీ వారి నుంచి కూడా నెగటివ్ టాక్ రావడంతో ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ బారి నష్టాలు చూసే అవకాశం కనిపిస్తుంది. చిత్ర ప్రదర్శిస్తున్న చాల సెంటెర్స్లో ప్రేక్షకులు లేక షోస్ రద్దు అవుతున్నాయి. కొన్ని థియేటర్స్ లో అయితే కనీసం 20 టికెట్స్ కూడా తెగట్లేదు అంటే అర్ధం చేస్కోవచ్చు. ఈ పండగ సేవలను ఉపయోగించుకుందాం అనుకున్న చిత్ర బృందానికి నిరాశే మిగిలింది అని చెప్పాలి. ఇవాళ రిలీజ్ అయినా జై సింహ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్రం రికవరీ అయ్యే అవకాశాలు కూడా కొంచెం తగ్గాయి అని చెప్పాలి.  
       నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టిన చిత్ర బృందం ఇప్పుడు ప్లాన్ బి తో ముందుకు వస్తుంది. ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ నటించిన విషయం తెలిసిందే కానీ సినిమా ప్రారంభ టైటిల్స్ లో వెంకీ థాంక్స్ చెప్పి, ఆ సీన్స్ చిత్రాల్లో నుంచి తీసేసిన విషయం తెలిసిందే. ఇప్పడు వెంకటేష్ అభిమానులను మరియు ఫామిలీ ఆడియన్స్ ని ఈ పండగకి తమ చిత్రం వైపు తిప్పుకునేందుకు ఈ చిత్ర నిర్మాతలు వెంకీ ఉన్న సీన్స్ ఈ నెల 14 నుంచి ప్రదర్శిస్తున్నారు. వీటి నిడివి 8 నిముషాలు అని తెలుస్తుంది. ఈ సీన్స్ చూడటానికి పవన్ కళ్యాణ్ ఫాన్స్ మరోసారి వస్తారు అని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇది మన హారిక అండ్ హాసిని వారి ప్లాన్ బి, ఈ ప్లాన్ బి వర్క్ అవుతుందో లేదో చూడాలి అంటే రేపటి దాక ఆగి చూడాలి.