ఏసీబీ వలలో చిక్కిన కమర్షియల్ టాక్స్ అధికారులు

Posted on : 13/01/2018 12:42:00 am

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 23.5 లక్షల భారీ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఏపీ కమర్షియల్ టాక్స్ అధికారులు. టాక్స్ డిప్యూటీ కమిషనర్ ఏడుకొండలు, అసిస్టెంట్ కమిషనర్ అనంతరెడ్డి గా తెలుస్తుంది, పక్క సమాచారంతో ఏసీబీ ఈ అధికారులను శుక్రవారం పట్టుకుంది. ఐటీడీ సిమెంటేషన్‌ కంపెనీకి రూ.4.50 కోట్ల మేర పన్ను రాయితీ ఇప్పించేందుకు వాణిజ్యపన్నుల శాఖ జీఎస్టీ విభాగం బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఏడుకొండలు రూ.23.50 లక్షలు లంచం అడిగినట్లు తెలిసింది. తమ వద్ద ఈ అధికారులు లంచం అడిగినట్టు ఐటీడీ కంపెనీ ఏసీబీ దృష్టికి తేవడంతో వారు వేసిన వలలో ఈ అవినీతి తిమింగలాలు దొరికినట్టు తెలుస్తుంది. ఐటీడీకి చెల్లించాల్సిన ఇన్‌ఫుట్ పన్ను రాయితీ విడుదలకు ఏడుకొండలు, అనంతరెడ్డి రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ డీజీ ఠాకూర్‌ తెలిపారు. వీరే కాకుండా కమర్షియల్ టాక్స్ విభాగంకు సంబంధించి మరి ఇద్దరు (మొత్తం నలుగురి) అధికారుల ప్రమేయం వుందని అయన చెప్పారు. తదుపరి విచారణ తర్వాత వారిని అరెస్ట్ చేస్తామని ఏసీబీ డీజీ ఠాకూర్‌ తెలిపారు.