సందేహం లేదు ట్రంప్ రేసిస్టే

Posted on : 13/01/2018 12:53:00 am

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి   నోరు పారేసుకున్నారు. హైతీలో ఎయిడ్స్ రోగులు ఉంటారని ఇదివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు.  

వాషింగ్టన్‌ పోస్ట్‌ అందించిన సమాచారం ప్రకారం అతి చెత్త(షిట్‌ హోల్‌) దేశాలనుంచి ఇమ్మిగ్రెంట్స్‌ అమెరికాకు ఎందుకు వస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైతీ, ఆఫ్రికా దేశాలు చెత్త దేశాలని, అలాంటి దేశాల ప్రజలను ఎందుకు తమ దేశంలోకి అనుమతించాలని అన్నారు. గురువారం డెమోక్రటిక్‌ సెనేటర్‌ డిక్‌ డర్బిన్‌, రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రహాంలతో వైట్ హౌస్ లో వలస ఒప్పందం గురించి చర్చిస్తూ ఇలా అన్నారు.

మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్‌ అజెండా నిజంగా మేక్ అమెరికా వైట్ ఎగైన్‌ ఎజెండా అని మరోసారి రుజువైందని బ్లాక్ డెమోక్రాటిక్ శాసనసభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ విమర్శించారు. జాత్యహంకారంతో​   అధ్యక్షుడు ట్రంప్‌ మరింత దిగజారిపోతున్నారని జాతీయ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ కలర్డ్ పీపుల్ ఆరోపించింది.

‘నార్వేలాంటి దేశాలకు చెందిన ఇమ్మిగ్రెంట్లను అమెరికా ఆహ్వానించాలి. అంతేగాని, ఆఫ్రికా, హైతీలాంటి చెత్త దేశాల నుంచి కాదు.. ’ అని ఆయన అన్నారు. ఇది ఆయా దేశాలను, జాతులను అవమానించడమేనని విమర్శలు వస్తున్నాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు  బుధవారం నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్‌తో జరిపిన సమావేశం నేపథ్యంలో ట్రంప్‌ నార్వే గురించి ప్రస్తావించారు. =ట్రంప్ పై విమర్శను వైట్ హౌస్ ప్రతినిధులు తోసిపుచ్చారు. ఆయన ఏం చేసినా అమెరికన్ల ప్రయోజనాలకే చేస్తారని చెప్పుకొచ్చారు.