పోర్న్ తో ముందుకు వస్తున్న వర్మ

Posted on : 13/01/2018 01:30:00 am

             రామ్ గోపాల్ వర్మ ఎంత అర్ధం చేసుకోవాలి అంటే అంత అర్ధం కాడు. వర్మ అంటే ఒక సంచలనం, ఆయన చుట్టూ ఎదో ఒక వివాదం ఉండాలి. ఆయన మాట్లాడే మాటలు వింటే కొన్ని సార్లు అపర మేధావిలా అనిపిస్తాయి, కొన్ని సార్లు అవివేకంగా అనిపిస్తాయి. దేవుడు లేడు అని నమ్మే వర్మ దయ్యం ఉంది అని సినిమా తీస్తాడు. ఆయన వ్యంగ్యం ఎవరికీ అర్ధం కాదు, కొన్ని సార్లు ఆయన ఒకర్ని పొగిడారో లేక తిట్టారో అవతలి వాళ్ళకి కూడా అర్ధం కాదు. తాను అనుకున్నది ముక్కుసూటిగా చెప్పే వర్మ అవతలి వాళ్ల మనోభావాల గురించి అసలు లెక్కచేయడు. తాను అనుకున్నది తియ్యనివ్వట్లేదు అని తన స్థాయి కాకపోయినా షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసాడు వర్మ. ఆయన్ని తిట్టే వాళ్ళు కూడా ఆయన్ని వారికి తెలియకుండానే ఆయన్ని ఇష్టపడతారు. ఆయన్ని ఫాలో అవుతున్న 30 లక్షల మంది దీనికి సాక్ష్యం. ఆయన మాట్లాడే దాన్లో లాజిక్ ఉంది, మనం అడిగే ప్రతిప్రశ్నకి సమాధానం ఉంటుంది. వర్మని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే, అయన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు ఉంటుంది. అయన అంటే ఇష్టపడే వాళ్ళకి అయన ఒక మత్తు. ఆయన సన్నిహితులు ఆయనని ఒక ఓల్డ్ వైన్ తో పోలుస్తారు, ఎంత తాగితే అంత కిక్ వస్తుంది అని, అలాగే ఆయన్ని ఎంత అర్ధం చేసుకుంటే అంత ఇష్టపడతాం (కానీ ఎవరికీ అర్ధం కారు)
      పోర్న్ చూస్తాను, పోర్న్ ఇష్టపడ్తాను అని చెప్పే వర్మ ఇపుడు పోర్న్ స్టార్ మియా మాల్కోవా (Mia Malkova ) తో ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నారు. GST (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) అని పేరు పెట్టిన ఈ షార్ట్ ఫిలిం ట్రైలర్ ఈ నెల 16న విడుదల అవుతుంది. సెక్స్ అంటే ఒక బూతు అని నమ్మే మన దేశంలో అది ప్రకృతిలో ఒక పార్ట్ అని దాన్ని బూతుగా చూడవద్దు అని చెప్పడమే కాకుండా, ఇప్పుడు దాన్ని దర్శకత్వం వహించడం అయన దమ్మును సూచిస్తుంది. అయన నమ్మింది చేసే వర్మ దానికోసం ప్రపంచం మొత్తాన్ని కూడా వ్యతిరేకిస్తాడు.