ప‌వ‌న్, జ‌గ‌న్ ల‌కు ఓవ‌ర్ కాన్ఫిడెన్సు ఎక్కువ

Posted on : 13/01/2018 01:52:00 am

సీనియర్ నటుడు, మాజీ ఎమ్మల్యే బీజేపీ నేత కోట శ్రీనివాసరావు ఓ టివి ఛాన‌ల్ కి ఇచ్చిన  ఇంటర్వ్యూ లో పలు విషయాలను ఇటీవ‌ల  ప్రస్తావించారు... సినిమాలు,  రాజకీయాల పై ఆయ‌న అనేక విష‌యాల‌పై క్లారిటీ గా ఇంట‌ర్వూలో మాట్లాడారు.  ముందుగా సొంత పార్టీ గురించి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే.. బీజేపీకి ఊతం పట్టి నడిపే నాయకులు లేర‌ని,  బీజేపీకి దాని స్థానం దానికే ప‌దిల‌మ‌ని,  వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొన్ని స్థానాలు రావ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  రెండు తెలుగు రాష్ర్టాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ  ప్రభుత్వాల్ని ఏర్పరచడం  కష్టమేన‌ని పేర్కొన్నారు.

అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు గురించి మాట్లాడుతూ, ఎవరి కాన్ఫిడెన్సు వారిద‌ని,  అయ‌తే రాబోయే రోజుల్లో  ‘నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని, నేనే ముఖ్యమంత్రిని’ అని జగన్మోహన్ రెడ్డిఅనట్లేదా, సోము వీర్రాజు వ్యాఖ్యలు కూడా అంతే అని అన్నారు.. అలాగే రోజా మీద మాట్లాడుతూ, ‘నిర్మొహమాటంగా చెప్పాలంటే..రోజాని  పొలిటికల్ లీడర్ గా నేను పరిగణించన‌ని,పెద్ద‌గా  పట్టించుకోనని,  ఆమె మాట్లాడే పద్ధతి నాకు అస‌లు నచ్చదని చెప్పారు. ఇటీవ‌ల ఓ టీవీ షోలో కూడా.. నిర్మాత బండ్ల గణేష్, రోజా పోట్లాడుకోవడం చూశాను. ఏమిటా మాటలు? ఏమన్నా అర్థముందా? పోనీ, బండ్ల గణేశ్ అంటే ఏదో కుర్ర వెధవ, పిచ్చోడిలా వాగాడు. రోజా కేంటీ.. నువ్వు అనుభవజ్ఞురాలివి, ఎమ్మెల్యేగా చేశావు. ఆ అమ్మాయి గురించి నేనేమి వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. బయటకు కనపడుతున్నది అది అని కోటా అన్నారు...

అలాగే చంద్రబాబు గురించి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ చంద్రబాబు చేతిలో ఉండటమే మంచిదని కోటా అన్నారు... తెలంగాణలో కెసిఆర్ కి వడ్డించిన విస్తరి... ఆంధ్రాలో అలా కాదు కానీ  ఆకులు పట్టుకుని విస్తరి తయారు చేసుకోవాలని..  నా లెక్క ప్రకారం..హైదరాబాద్ లో ఉన్న రోడ్ల లాగా బెజవాడ, అమరావతిలో రావాలంటే కనీసం 20 ఏళ్ళు  పడుతుంద‌న్నారు. ముందస్తు ఆలోచన చేసే గొప్ప రాజకీయనాయకుడు, మంచి పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు. ఏపీ ఆయన చేతిలో ఉండటమే మంచిది. అంతకన్నా ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఆయన తప్పా ఇంకెవరు అభివృద్ధి చేయగలరు?’ అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా చాలా మంది నాయ‌కులు ఒక పార్టీ సింబ‌ల్ తో గెలిచి,  త‌ర్వాత మ‌రో పార్టీకి మారుపోతున్నార‌ని.. ఆ నాయ‌కుడు  ప్ర‌జ‌లచే ఎన్నుకోబ‌డ్డాడ‌న్న విషయాన్ని మ‌ర‌చి,  నైతిక విలువ‌ల‌ను సైతం పూర్తిగా విస్మ‌రిస్తున్నార‌ని, అది స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని కోటా శ్రీ‌నివాస‌రావు చెప్పు కొచ్చారు.