సెంచరీ స్పీడుతో ఇస్రో...కడుపు మంటతో పాక్...

Posted on : 13/01/2018 01:56:00 am

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతోపాటు తన 100వ ఉపగ్రహాన్ని ఈరోజు అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా కార్టోశాట్‌–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశ‌పెట్టింది.

అయితే ఈ ప్రయోగానికి కొన్ని గంటల ముందే పాక్‌ తన అక్కసును వెళ్లగక్కింది. 'మాకు అందిన సమాచారం ప్రకారం భూభాగాన్ని పర్యవేక్షించే కార్టోశాట్‌ ఉప్రగ్రహంతోపాటు మొత్తం 31 ఉపగ్రహాలు జనవరి 12న(శుక్రవారం) ప్రయోగిస్తుందని తెలిసింది. ఇలాంటి ప్రయోగాల వలన దేశాల మధ్య ప్రాంతీయ వ్యూహాత్మాక స్థిరత్వం దెబ్బతింటుందంటూ వ్యాఖ్యానించింది.  భారత్ చేసిన ఈ ప్రయోగం తప్పకుండా విఫలం అవుతోందని పాక్ విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ అన్నాడు.

ఇలా చేస్తే వ్యూహాత్మాక భాగస్వామ్యం తన నిలకడను కోల్పోతుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. అంతరిక్ష శాస్త్ర  పరిజ్ఞానాన్ని ,శాంతియుత వాతావరణం దెబ్బతినకుండా ప్రయోగాలు చేసేందుకు అన్ని దేశాలకు అవకాశం ఉంది. కానీ ఒక దేశ మిలిటరి నిలకడను దెబ్బతీసే విధంగా ఉండద్దు’ అని అన్నాడు. భారత్  నింగిలోకి రాకెట్‌ను పంపే కొన్ని గంటల ముందే పాక్ తన విషాన్ని చిమ్మింది.