కాళ్ళు మొక్కే అంత అభిమానం సూర్యాకు

Posted on : 13/01/2018 01:54:00 am

కొందరు హీరోలు అభిమానులు అంటే వారికి బానిసలు అనుకుంటారు, కొందరు తమ అభిమానాన్ని కొట్టి చూపిస్తారు, ఇంకొందరు అభిమానులను పక్కకి నెట్టేసి చూపిస్తారు. కొంతమంది అభిమానులతో సెల్ఫీ దిగి వారి అభిమానాన్ని చూపిస్తారు. అభిమానులు అంటే వారి మాటల్లో కనిపించే అభిమానం చేతల్లో చాల మంది హీరోలు చూపించరు. కానీ సూర్య తాను అభిమానులకు ఎంత విలువ ఇస్తాడో ఒక్క పనితో అందరికి అర్ధం అయిపొయింది.

సాధారణంగా తమకు ఇష్టమయిన, ఆరాధించే హీరోని దగ్గరగా చూసినపుడు ఉద్వేగానికి లోనవుతారు అభిమానులు, ఆ సమయం లో ఒకొక్కరు ఒకో విధంగా చేస్తుంటారు. కొంతమంది ఆ క్షణాలను శాశ్వతం చేసుకునేందుకు సెల్ఫీస్ దిగుతారు, ఇంకొందరు దండలు, హారాలు వేస్తారు, ఇంకొందరు కాలు మొక్కుతారు. అభిమానులు అలా చేసినపుడు సాధారణంగా హీరోలు వారిని లేపడమో, లేకపోతే నమస్కరించడమో లాంటివి చేస్తారు, కొంతమంది అభిమానం ఎక్కువ అయితే చెంప చెళ్లుమనిపిస్తారు. కానీ సూర్యా తాను అందరి లాంటి వాడిని కాదు అని నిరూపించుకున్నాడు. తన ఒక్క చర్య తో అందనంత ఎత్తుకు నిలిచాడు అని చెప్పాలి. ఒక అభిమాని గ్యాంగ్ ఆడియో ఫంక్షన్ లో సూర్య కాళ్ళు మొక్కగా ఆయన ప్రతిగా తిరిగి వారి కళ్ళు మొక్కారు. ఈ ఒక్క చర్యతో అయన అభిమానులకు ఎంత విలువ ఇస్తున్నారో అర్ధం అవుతుంది. అభిమానులు అంటే అసలు సాటి మనుషులుగా గుర్తించని హీరోలు ఉన్న ఈ కలంలో, వారి అభిమానం వల్లే తాను ఈ స్థాయికి వెళ్ళాను అని గుర్తుంచుకొని తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కిన సూర్య లాంటి రియల్ హీరోస్ మన మధ్యలో ఉండటం గర్వించదగ్గ విషయం.

హ్యాట్సప్ సూర్య.