ATMs లో కాష్ నిల్

Posted on : 13/01/2018 03:29:00 pm

     తెలుగు ప్రజలు ఎంతో బాగా చేస్కునే సంక్రాంతి పండుగకు మళ్ళి నోట్ల కరువు వచ్చింది, వరుసగా పండుగ రోజులు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ATMs అన్ని దాదాపు కాళీ అయ్యాయి. పండుగ సామాగ్రి కొనడానికి, కొత్త బట్టలు, వంట సామాగ్రి కొనడానికి డబ్బులు లేక ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు ఉన్న కొన్ని ATMs ముందు కూడా చాల పొడవు క్యూలు ఉన్నాయి. పోనీ బ్యాంక్స్ కి వెళ్లి డబ్బులు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి బ్యాంకులో నగదు లభ్యతలేదు అని సమాధానం వస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది అని తెలుస్తుంది. బ్యాంకు అకౌంట్ లో డబ్బులు ఉండి కూడా పండగ చేసుకోలేని దౌర్బాగ్యం మన మోడీ హయాంలోనే వచ్చింది అని చెప్పాలి.
      గత ఏడాది నోట్లరద్దుతో జనాలు అనేకరకాలుగా ఇబ్బంది పడ్డారు, సంక్రాంతికి డబ్బులులేక ప్రజలు విలవిలలాడారు. ఆ భాద నుంచి బయటపడటానికి దాదాపు 6 నెలలు పట్టింది. ఇప్పుడు ఈ పండగకి కూడా డబ్బులు లేకపోవడంతో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సరిగా ప్లాన్ చేసి ఉంటే ప్రజలను ఈ ఇబ్బందులు వచ్చేవి కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సరిపడా నగదు ATMs లో ఉంచడంలో పూర్తిగా విఫలం అయ్యాయి.